Urvasivo Rakshasivo Movie Review : ఊర్వశివో రాక్షసివో రివ్యూ: అనూ ఇమ్మాన్యుయేల్ కోసం చూడొచ్చు.!

NQ Staff - November 4, 2022 / 11:29 AM IST

Urvasivo Rakshasivo Movie Review  : ఊర్వశివో రాక్షసివో రివ్యూ: అనూ ఇమ్మాన్యుయేల్ కోసం చూడొచ్చు.!

Urvasivo Rakshasivo Movie Review  : అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కిన ‘ప్రేమంటే కాదంట’ సినిమానే, ‘ఊర్వశివో రాక్షసివో’ అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎప్పుడో విడుదలవ్వాల్సిన సినిమా ఇది. అనివార్య కారణాల వల్ల విడుదల ఆలస్యమవుతూ వచ్చింది.. ఎట్టకేలకు కొత్త పేరుతో పలకరించింది. సినిమా ప్రమోషన్లను చాలా బాగా చేశారు. నందమూరి బాలకృష్ణ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరావడం, సినిమాపై అంచనాలు ఇంకాస్త పెరగడానికి కారణమైంది. ఇంతకీ, ఈ సినిమా కథా, కమామిషు ఏంటి.? తెలుసుకుందాం పదండిక..

కథేంటంటే..

ఓ ఐటీ కంపెనీలో పని చేస్తుంటారు హీరో హీరోయిన్లు. హీరోయిన్ మీద హీరో ప్రేమ పెంచుకుంటాడు. ఇద్దరూ కనెక్ట్ అవుతారు. శారీరకంగానూ కలుస్తారు. ఇద్దరూ కలిసి ప్రత్యేక పరిస్థితుల్లో సహజీవనం చేయాల్సి వస్తుంది. హీరోయిన్ మీద హీరో ప్రేమని పెంచుకుంటే, ఈ రోజుల్లో ఇలాంవన్నీ కామన్ అనుకుంటుంది తప్ప.. దాన్ని ప్రేమలా అనుకోదు హీరోయిన్. మరి, ఈ ఇద్దరి సహజీవనం, పెళ్ళికి దారి తీసిందా.? హీరో ప్రేమని హీరోయిన్ అర్థం చేసుకుంటుందా.? లేదా.? ఈ ప్రశ్నలకు సమాధానం తెరపైనే దొరుకుతుంది.

నటీనటుల పనితీరు..

అల్లు శిరీష్ డీసెంట్ రోల్ చేశాడు. గతంలో చేసిన సినిమాలతో పోల్చితే, నటుడిగా ఇంకాస్త మెరుగయ్యాడు. హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్ నేచురల్ గ్లామర్‌తో ఆకట్టుకుంటుంది. నటన పరంగానూ ఆమెకు మంచి మార్కులు పడతాయి. అవసరమైనంత మేర గ్లామర్‌తోనూ సత్తా చాటింది.
వెన్నెల కిషోర్, సునీల్.. కామెడీ పండించడానికి ప్రయత్నించారు. ఆమని పాత్ర నిడివి తక్కువే. మిగతా పాత్రధారుల గురించి పెద్దగా చెప్పుకోవడానికేమీ లేదు.

సాంకేతిక వర్గమెలా పనిచేసిందంటే..

సినిమాటోగ్రఫీ బాగానే వుంది. మ్యూజిక్ పరంగా ఇంకాస్త బెటర్‌గా వుండి వుంటే బావుండేది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకోదు. పాటలు ఏవీ రిపీటెడ్ వాల్యూ వున్నవి కావు. నిర్మాణపు విలువలు బావున్నాయి.

ప్లస్ పాయింట్స్

Urvasivo Rakshasivo Movie Review

Urvasivo Rakshasivo Movie Review

అనూ ఇమ్మాన్యుయేల్ గ్లామర్
యూత్‌పుల్ ఎలిమెంట్స్
కొన్ని సన్నివేశాల్లో పండిన కామెడీ
నెగెటివ్ పాయింట్స్

స్టోరీ, స్కీన్‌ప్లే

Urvasivo Rakshasivo Movie Review

Urvasivo Rakshasivo Movie Review

స్లో నెరేషన్
పాటలు అంతగా బాలేకపోవడం, బీజీఎం

విశ్లేషణ

నేటి యువతరం ఆలోచనల్ని ప్రతిబింబించేలా సినిమాని తెరకెక్కించేందుకు దర్శకుడు ప్రయత్నించాడు. అయితే, ఈ క్రమంలో నిడివి విషయంలో జాగ్రత్త పడి వుండాల్సింది. అనూ ఇమ్మాన్యుయేల్ తెరపై కనిపించినంతసేపూ ప్లెజెంట్‌గా అనిపిస్తుంటుంది. కుర్రకారుని బాగానే గిలిగింతలు పెట్టిందామె. నిడివి తక్కువ వుండి వుంటే, ఇంకాస్త బెటర్ రిజల్ట్ వచ్చేందుకు అవకాశముండేది. కథ, కథనాల విషయంలోనూ ఇంకొంచెం శ్రద్ధ పెట్టి వుంటే బావుండేది.

                                                            రేటింగ్: 2.5/5

Read Today's Latest సినిమా రివ్యూలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us