Urvashi Rautela Demands Remuneration : నిముషానికి కోటి తీసుకుంటున్న హీరోయిన్.. ఇండియాలోనే అత్యంత కాస్ట్లీ యాక్టర్..!
NQ Staff - July 11, 2023 / 11:00 AM IST

Urvashi Rautela Demands Remuneration :
ఏంటి నిముషానికి కోటి రూపాయలా.. ఇదెక్కడి విడ్డూరం అని ఆశ్చర్యపోకండి. మీరు విన్నది నిజమే. అవును ఆమె సినిమాలో కనపడాలంటే నిముషానికి కోటి ఇవ్వాలంట. ఆమె అడిగినంత ప్రొడ్యూసర్లు కూడా ఇచ్చేస్తున్నారు. దాంతో ఇండియాలోనే అత్యధిక కాస్ట్లీ హీరోయిన్ గా రికార్డు సృష్టిస్తోంది ఈ భామ.
ఇంతకీ ఆమె ఎవరో కాదండోయో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా. ఆమె ఇప్పుడు టాలీవుడ్ లో వరుసగా ఐటెం సాంగ్స్ చేస్తూ ఊపేస్తోంది. మొన్ననే చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో ఆడిపాడింది. దానికి బాగానే తీసుకుంది. ఆ తర్వాత పవన్ కల్యాణ్-సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న బ్రో సినిమాలో కూడా ఆడిపాడింది.
ఆ సినిమా కోసం..
ఇప్పుడు బోయపాటి శ్రీను-రామ్ పోతినేని కాంబోలో వస్తున్న స్కంద సినిమాలో కూడా ఐటెం సాంగ్ చేస్తోంది ఈ భామ. అయితే మూడు నిముషాల నిడివి ఉన్న ఈ పాటలో కనిపించేందుకు ఆమె ఏకంగా రూ.3 కోట్లు తీసుకుంటుందంట. ఈ విషయాన్ని నిర్మాతలు కూడా కన్ఫర్మ్ చేశారు.

Urvashi Rautela Demands Remuneration
ఆమె అంత ఇస్తేనే చేస్తానంటూ చెప్పేయడంతో చేసేది లేక ఆమెకు అంత ఇస్తున్నారంట. హీరోయిన్లు నెలల తరబడి చేస్తే కూడా ఇంత సంపాదించట్లేదు. కానీ ఆమె ఒక్క సాంగ్ తోనే ఒక సినిమాకు స్టార్ హీరోయిన్ తీసుకునేంత రెమ్యునరేషన్ తీసుకుంటోంది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఇక ముందు ముందు ఇంకెంత తీసుకుంటుందో చూడాలి.