Gayatri Jayaraman: బేబమ్మ మ‌ద‌ర్ చాలా హాట్ గురూ… ఏ సినిమాలో న‌టించిందో తెలుసా?

Gayatri Jayaraman: సాధార‌ణంగా త‌ల్లిదండ్రుల ద్వారా పిల్ల‌ల‌కి గుర్తింపు వ‌స్తుంది. కొన్ని సంద‌ర్భాల‌లో పిల్ల‌ల ద్వారా మాత్ర‌మే త‌ల్లిదండ్రులు పాపుల‌ర్ అవుతుంటారు. ఆ స‌మ‌యంలో ఆ త‌ల్లిదండ్రుల ఆనందం అంతా ఇంతా కాదు. తాము క‌న్న క‌ల‌ల‌ని నిజం చేసినందుకు పేరెంట్స్ చాలా సంతోషిస్తూ ఉంటారు.అయితే ఉప్పెన సినిమాలో బేబ‌మ్మ త‌ల్లిగా న‌టించిన న‌టి ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెన ద్వారా తెలుగు తెరకు పరిచయమైన కృతి శెట్టి ఈ సినిమాలో త‌న న‌ట‌న‌తో పాటు అంద‌చందాల‌తో ఎంత‌గానో అల‌రించింది. ఉప్పెన కంటే ముందే ఈ బ్యూటీకి సౌత్ లో చాలా ఆఫర్స్ వచ్చాయట. కానీ అవి నచ్చక ఒప్పుకోలేదు. ఇక ఉప్పెనకు అంతకుముందే ఒక హీరోయిన్ సెలెక్ట్ అయినప్పటికీ ఆమె కాస్త ఓపికతో ఉంటూ ఛాన్స్ అందుకుంది.

ప్రస్తుతం కృతి శెట్టి చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. శ్యామ్ సింగరాయ్, రామ్ – లింగుస్వామి ప్రాజెక్ట్, అలాగే సుధీర్ బాబు – మోహన్ కృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రూపొందుతున్న ‘ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమా చేస్తోంది. ఈ మూడు సినిమాలతో కృతి 2కోట్లకు పైగానే ఆదాయాన్ని అందుకుంటోందట.

అయితే ఉప్పెన సినిమాలో బేబమ్మ పాత్ర పోషించిన కృతి శెట్టికి తల్లిగా న‌టించిన గాయత్రి జయరామన్ గురించి చాలా త‌క్కువ మందికి తెలుసు. ఉప్పెన సినిమాలో గాయ‌త్రిది చాలా చిన్న పాత్ర‌. ఇందులో ఎలాంటి డైలాగ్స్ ఉండ‌వు, కేవ‌లం హావభావాల‌తో మాత్ర‌మే మెప్పించ‌గ‌లిగే పాత్ర‌లో ఆమె న‌టించింది.

గాయ‌త్ని జ‌య‌రామ‌న్ ఒక‌ప్పుడు హీరోయిన్‌గా న‌టించింది. 2001లో విడుదలైన నీలా అనే కన్నడ చిత్రం ద్వారా ఆమె సినిమా పరిశ్రమకి పరిచయం అయిన ఆమె తెలుగులో శ్రీకాంత్ హీరోగా, దేవీప్రసాద్ దర్శకత్వంలో 2002లో వచ్చిన ఆడుతూ పాడుతూ అనే సినిమాలో గాయిత్రి పాత్రను పోషించింది. ఈ సినిమాతో పాటుగా ఆనందం ఫేమ్ ఆకాష్ హీరోగా వచ్చిన నాయిడు LLB అనే సినిమాలో హీరోయిన్‌‌గా నటించింది.

ఏ సినిమాలు గాయ‌త్రికి బ్రేక్ ఇవ్వ‌క‌పోవ‌డంతో 2007లో పెళ్లి చేసుకుంది.ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా స‌త్తా చాటుతూ ప‌లు ఆఫ‌ర్స్ అందుకుంటుంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోను హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ ర‌చ్చ చేస్తుంటుంది.