upasana sister marriage : అట్టహాసంగా రామ్ చరణ్ మరదలి పెళ్లి.. హాజరైన చిరంజీవి, రానా
NQ Staff - December 8, 2021 / 12:12 PM IST

upasana sister marriage : గడి కోట సంస్థానాధీశుల కామినేని అనిల్ కుమార్ శోభన రెండో కూతురు అనుష్పాల వివాహం అట్టహాసంగా జరిగింది. ముందుగా దోమకొండలో పోచమ్మ పండగ నిర్వహించారు. మంగళవారం రోజు పెళ్లి వేడుక జరిగింది. పెళ్ళికి ముందు జరిగిన సంగీత్, ముఖ్యంగా పెళ్లికి ముందు జరిగిన వేడుకల నుండి చరణ్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించాయి.
తాజాగా అనుష్పల వివాహానికి రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్ కూడా హాజరైన పిక్ ఒకటి బయటకు వచ్చింది. అందులో ఈ సెలెబ్రిటీ దంపతులతో పాటు రామ్ చరణ్ కూడా ఉన్నాడు. పిక్ లో ముగ్గురూ అద్భుతంగా కన్పిస్తున్నారు. మిహీకా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫోటోను పంచుకుంటూ “చివరకు రానా దగ్గుబాటి అందంగా పెరిగాడు” అని రాసుకొచ్చింది.
పెళ్లికి చిరంజీవి దంపతులు కూడా హాజరైనట్టు తెలుస్తుంది. ఇక పెళ్ళికి ముందు జరిగిన సంగీత్, ముఖ్యంగా పెళ్లికి ముందు జరిగిన వేడుకల నుండి చరణ్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించాయి. ఇక పెళ్లి వేడుకలు ప్రారంభరోజు నుంచి వివాహం వరకు ప్రతి అప్డేట్.. ఫోటోలను సోషల్ మీడియాలో షేరు చేస్తున్నారు ఉపాసన.

rana with ramcharan
దోమకొండ కోటలో జరిగిన పోచమ్మ పండుగ.. నుంచి సంగీత్ వేడుకలు ఇలా అన్ని సందర్భాల ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అనుష్పా పెళ్లి వేడుకలలో రామ్ చరణ్‌తోపాటు మెగా ఫ్యామిలీ కూడా సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను చరణ్ తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశారు.
రేసర్ అర్మన్ ఇబ్రహీం-అనుష్పాల కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. మాజీ ఇండియన్ ఎఫ్ 3 ఛాంపియన్ అక్బర్ ఇబ్రహీం తనయుడే అర్మన్ ఇబ్రహీం. కార్ రేసర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అర్మాన్ ఇబ్రహీం తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని కార్ రేసర్ గా ప్రతిభను నిరూపించుకుని పాపులారిటీ సంపాదించాడు.

uPASANA SISTER marriage
కారు రేసర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఇక అనుష్పాల అపోలో సంస్థల కార్యకలాపాల్లో ఉపాసనతో పాటు బిజీబిజీగా ఉంటారు. అపోలో గ్రూప్ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి.. దోమకొండ కోటకు చెందిన ఉమాపతి రావులకు అనుష్పాల మనవరాలు. శోభన- అనిల్ కామినేనిల రెండో కూతురు.