బీజేపీ ఎమ్మెల్యే మృతి

Advertisement

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ బీజేపీ ఎమ్మెల్యే జన్ మేజయ సింగ్ (75) గురువారం అర్థ‌రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. అయితే తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయనను హుటా హుటిన మొద‌ట సివిల్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి మరింత విషమించడంతో లోహియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇక అప్పటికి ఎమ్మెల్యే ఆరోగ్యం పూర్తిగా విషమించింది.

అయితే ఫేస్ మేక‌ర్ అమ‌రుస్తుండ‌గా ఆయనకు గుండెనొప్పి తీవ్రంగా రావ‌డంతో చ‌నిపోయిన‌ట్లు ఆసుపత్రి సూప‌రిండెంట్ డాక్ట‌ర్ విక్ర‌మ్‌సింగ్ తెలిపారు. ఇక ఎమ్మెల్యే మేజయ సింగ్ అకాల మ‌ర‌ణం ప‌ట్ల ఉత్తరప్రదేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here