అన్ లాక్ 3 లో మరింత స్వేచ్ఛ.. తెరిచేవి, మూసేవి ఇవే..!
Admin - July 27, 2020 / 08:27 AM IST

దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంది. ఇప్పటికే పది నాలుగు లక్షల కేసులు నమోదయ్యాయి. ఇది ఇలా ఉంటె కేంద్ర సర్కార్ మరో నిర్ణయం తీసుకుంది. ఆగష్టు 1 వ తేదీ నుండి అన్ లాక్-3 ప్రక్రియను అమలు చేసే దిశగా ప్రణాళిక రూపొందిస్తుంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలతో ఈ విషయం మాట్లాడింది. రాష్ట్రాలు అన్ని కూడా సడలింపులు అమలు చేస్తామని తెలిపాయి.
అయితే ఈ అన్ లాక్-3 ప్రక్రియలో సినిమా హాళ్లకు అనుమతులు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది. సినిమా హాళ్లకు ఇరువై ఐదు శాతం ఆక్యుపెన్సీ తో అనుమతులు ఇవ్వనుంది. అలాగే శానిటైజెషన్ నిబంధనలను పెట్టనున్నారు. ఒకవైపు సినిమా థియేటర్ యాజమాన్యాలు ఏమో యాబై శాతం ఆక్యుపెన్సీ ఇవ్వాలని కోరుతున్నారు.
ఒక సినిమా హళ్లే కాకుండా జిమ్ లకు కూడా అనుమతులు ఇవ్వనున్నారు. కానీ స్కూళ్ళు, కోచింగ్ సెంటర్ల్ మరియు మెట్రో ట్రైన్ లకు అనుమతులు ఇవ్వలేదు. అయితే స్కూళ్ళు సెప్టెంబర్ నెలలో ప్రారంభించే ఆలోచనలో ఉంది.
ఇప్పటికే అన్ లాక్-1 మరియు అన్ లాక్ -2 లతో సాధారణ జీవితం గడుపుతున్నాం. ఇక కరోనా కూడా మంచి ఊపు మీద ఉంది. ఇక ఈ ఆన్ లాక్-3 ప్రక్రియతో కరోనాకు మరింత స్వేచ్ఛ రానుంది.