Unknown Story About Mahesh Babu : నాకు మార్కులు రాలేదని ఆ కాలేజీలో సీటు ఇవ్వలేదు.. మహేశ్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

NQ Staff - August 11, 2023 / 10:33 AM IST

Unknown Story About Mahesh Babu : నాకు మార్కులు రాలేదని ఆ కాలేజీలో సీటు ఇవ్వలేదు.. మహేశ్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Unknown Story About Mahesh Babu :

సూపర్ స్టార్ మహేశ్ బాబు అంటే తెలియని ప్రేక్షకులు ఉండరు. ఇప్పుడు టాలీవుడ్ లో అగ్ర హీరోల్లో ఆయన కూడా ఒకరు. అయితే మహేశ్ బాబు ఇప్పుడు గుంటూరు కారం సినిమాతో చాలా బిజీగా గడుపుతున్నారు. ఆయన కెరీర్ పరంగా చాలా సక్సెస్ ఫుల్ హీరో. ఇటు సినిమాల పరంగానే కాదు అటు చదువులో కూడా ఆయన ఎప్పుడూ చురుగ్గానే ఉండేవారు.

అయితే ఓ సారి మాత్రం తనకు సరైన మార్కులు రాలేదనే ఉద్దేశంతో తనకు ఇష్టమైన కాలేజీలో సీటు ఇవ్వలేదంట. ఈ విషయాలను సూపర్ స్టార్ మహేశ్ బాబు భరత్ అనే నేను సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో బయట పెట్టారు. నేను చిన్నప్పటి నుంచే సినిమాల్లో నటిస్తున్నాను.

సీటు కోసం ప్రయత్నిస్తే…

కానీ ముందు చదువు పూర్తయిన తర్వాత సినిమాల్లోకి రావాలని మా నాన్న చెప్పాడు. దాంతో సినిమాలు తగ్గించి చదువు కున్నాను. కానీ నాకు ఇష్టమైన లయోలా కాలేజీలో డిగ్రీ సిటు కోసం ప్రయత్నిస్తే ఇంటర్ లో సరైన మార్కులు రాలేదని నాకు సీటు ఇవ్వలేదు. దాంతో చాలా డిసప్పాయింట్ అయ్యాను.

కానీ తర్వాత మళ్లీ కష్టపడి ఆ కాలేజీలో సీటు సంపాదించాను. ఇక చదువు పూర్తయ్యాక మళ్ళీ సినిమాలపై దృష్టి సారించి రాజకుమారుడు సినిమాతో మొదటిసారి హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాను. అక్కడి నుంచి ఇండస్ట్రీలోనే నా ప్రయాణం సాగుతోంది అంటూ తెలిపాడు మహేశ్ బాబు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us