ఉమా మహేశ్వర సినిమాలో ఈ అమ్మాయి గురించి ఎవ్వరికి తెలియని నిజాలు

Advertisement

ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలో హీరోయిన్ జ్యోతిని ఫ్లాష్ మాబ్ దృశ్యం లో చుసినపుడు ఉమా మహేశ్వరరావు ఏమనుకున్నాడో తేలిదు కాని, చాలా మందికి పల్లెటూరి బొమ్మలా అందంగా కనిపించింది. అంత నేచురల్ గా తన అసాధారణ వ్యక్తిత్వంతో చుసినా వెంటనే చాలా మంది రూప కొడువాయూర్ ను ఎంతగానో ఇష్టపడుతారు.

అయితే ఆమె జ్యోతిగా మనకు పరిచయం కాక ముందు రూపా కొడువాయూర్ “సాహోర్ బాహుబలి పాట” యొక్క ముఖచిత్రానికి భారీగా ప్రశంసలు అందుకున్నారు. అయితే గత 14 సంవత్సరాలుగా ప్రతి రోజు ఆమె 3 గంటలు కూచిపుడి భరతనాట్యం ప్రాక్టీస్ చెస్తున్నారు. ఆమె సినీ కెరీర్ కు ఈ డాన్స్ చాలా సహాయపడింది అని చెప్పుకోవచ్చు. అయితే ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య సినిమా కోసం రూప ఫోటోలు, ఫ్లాష్ మొబ్ డాన్స్ లు పంపిస్తే అవి చూసి డైరెక్టర్ వెంకటేష్ మహా సెలక్ట్ చేసారు. అంటే ఆమె డాన్స్ చూసి డైరెక్టర్ అదరగొట్టావ్ అని అని చెప్పాడు.

ఇక ఆమె వ్యక్తిగత వివరాల్లోకి వెళితే రూప విజయవాడకు చెందిన అమ్మాయి. ఓ ఇంటర్ వ్యూ లో ఆమె కొన్ని విషయాలు మాట్లాడుతూ.. నా తల్లి క్యాన్సర్ తో బాధపడుతూ ప్రస్తుతం ఆ వ్యాధి బారి నుండి కోలుకుంది. నా తల్లి అనుభవించిన భాద నాకు తెలుసు. అందుకే ఆమె పడిన కష్టాలు ఇంకా ఏ తల్లి అలాంటి కష్టాలు రాకుండా ఉండాలని ఎంబిబిఎస్ చదువుతున్నాను. అలాగే క్యాన్సర్ స్పెకాలిస్ట్ గా గొప్పడాక్టర్ కావాలని అనుకుంటున్నా.. అని తెలిపింది.

ఇక రూప డాన్సర్ గా, యాక్టర్ గా, డాక్టర్ గా మల్టీ టాస్కింగ్ చెస్తు అందరికి ఆదర్శంగా నిలుస్తుంది. ఆమెను చూసి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఆమె జీవితంలో మరిన్ని శిఖరాలు అవరోహించి గొప్ప పేరును సంపాదించుకోవాలి అని కోరుకుందాం.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here