కరెంట్ తీగలపై కూర్చునే పక్షులకు షాక్ ఎందుకో కొట్టదో తెలుసా

Advertisement

మనం తరుచుగా కరెంట్ తీగల పైన వాలి ఉన్న పక్షులను చూస్తూ ఉంటాం . అయితే మనలో చాలా మందికి తక్కువ మొత్తం లో ఉత్పత్తి అయ్యే కరెంట్ తీగలని ముట్టుకుంటేనే షాక్ తగిలి కిందపడిపోవడం లేదా చనిపోవడం జరుగుతుంది. అలాంటిది అత్యధిక శాతం ప్రసారం అయ్యే తీగల పైన వాలిన కానీ పక్షులకు కరెంటు వల్ల ఏ హాని జరుగదు. ఎందుకు అన్న ప్రశ్న చాలా మందికి ఏర్పడే ఉంటుంది.

పక్షులు అలా కరెంటు తీగల పైన వాలినప్పటికీ వాటికి హాని జరగకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. విద్యుత్తు ఎప్పుడైనా తక్కువ నిరోధం గుండా ప్రయాణం చేస్తుంది. అందువలనే ఎవరికైనా కరెంటు షాక్ కొట్టినప్పుడు విద్యుత్ నిరోధం కలిగిన చెక్క కర్రల ద్వారా మరియు ప్లాస్టిక్ వస్తువుల ద్వారా ఆ మనిషిని షాక్ నుండి విడగొడుతాం. అలాగే శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం పక్షుల్లో కూడా కొద్దొ గొప్ప నిరోధం ఉంటుంది అంట. అందువలనే కరెంటు అనేది పక్షి గుండా ప్రవహించదు అని తెలియచేస్తున్నారు.

మరొక సిద్ధాంతం ప్రకారం ఎలక్ట్రిసిటీ అనేది ఎక్కువ పొటెన్షియల్ నుండి తక్కువ ఉన్న వైపుగా ప్రయాణం చేస్తుంది. కానీ ఒక పక్షి ఒక తీగ పైన వాలినప్పుడు ఆ పక్షి తీగ పైన ఆనించే దాని రెండు కాళ్ళ మధ్య బేధం శూన్యం. అందువలన పక్షి లోకి ఆ విద్యుత్తు ప్రవహించకుంగా తీగ ద్వారానే ప్రయాణిస్తూ వెళ్తుంది. అదే ఒక వేల ఆ పక్షి దాని కాలుని తీగపైన ఉంచి మరొక కాలిని కనుక మరొక కరెంటు వైర్ పైన నో లేదా భూమి పైన నో ఆనించినట్లైతే కరెంటు ఆ మార్గం గుండా ప్రయాణిస్తుంది అప్ప్పుడు ఆ పక్షి లోకి కరెంట్ ప్రవహించడం ద్వారా అవి చనిపోయే అవకాశాలు ఉన్నాయి.

అదే ఫార్ములా కూడా మనుషుల్లో వర్తిస్తుంది అంట. మనం ఏదైనా ఒక్క తీగనే పట్టుకొని గట్టిగా వేలాడుతూ వేరే తీగకు లేదా భూమికి అనకుండా గాలిలో తేలినట్లైతే అది మన నుండి ప్రవహించకుండా నిరోధించబడి తీగ ద్వారానే ప్రయాణించే అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఒక వేల ప్రాక్టీకల్ ప్రయత్నిద్దాం అని మీరు ఎక్కడ మీరు ఇవి చేయకండి. చిన్న లోపం జరిగిన ఏకంగా ప్రాణాలే కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. ఇదండీ పక్షులు తీగల పైన వాలినప్పటికీ వాటికి ఏమి కాకపోవడానికి గల కారణం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here