Union Finance Department Issued Instructions To File IT Returns : 80 లక్షల మంది ఖాతాల్లో డబ్బు జమ చేసిన కేంద్ర ఆర్థిక శాఖ
NQ Staff - July 25, 2023 / 05:51 PM IST

Union Finance Department Issued Instructions To File IT Returns :
జులై 31వ తారీకు లోపు ఇన్‌కమ్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చే వారు అంతా కూడా తమ ఐటీ రిటర్న్స్ ను ఫైల్ చేయాలంటూ కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గడువు లోపు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకుంటే రూ.5 వేల వరకు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ఈ అయిదు రోజుల్లో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయని వారు ఫైల్ చేయాల్సిందిగా ఆదాయపన్ను శాఖ అధికారులు ప్రకటనలు చేస్తున్నారు.
ఇక ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన 4 కోట్ల మందిలో 80 లక్షల మందికి ట్యాక్స్ రిఫండ్ చేసినట్లుగా సీబీడీటీ ఛైర్మన్ నితిన్ గుప్తా పేర్కొన్నారు. మీరు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినట్లయితే మీ అకౌంట్ లో కేంద్ర ఆర్థిక శాఖ రిఫండ్ అమౌంట్ వేసిందేమో చెక్ చేసుకోండి.
ఆదాయపు పన్ను శాఖ 164వ వార్షికోత్సవం..
80 లక్షల మందిలో వారికి చెల్లించాల్సిన మొత్తంలో రిఫండ్ చేసినట్లుగా ఆయన తెలియజేశారు. ప్రస్తుతం ఐటీ శాఖలో ఉన్న సిబ్బంది కొరత కారణంగా ఈ రిఫండ్ అమౌంట్ చెల్లించడంలో ఆలస్యం అయినట్లుగా కూడా ఆయన తెలియజేశాడు. 164వ ఆదాయపు పన్ను శాఖ వార్షికోత్సవం సందర్భంగా నితిన్ గుప్తా మీడియా ప్రకటన విడుదల చేశారు.
గత ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరం ఐటీ రిటర్న్స్ అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. అంతే కాకుండా గతంతో పోల్చితే గరిష్టంగా 16 రోజుల్లోనే ఐటీ రిటర్న్స్ ప్రాసెస్ చేసినట్లుగా పేర్కొన్నారు. దేశంలో జులై 24న ఇన్ కమ్ ట్యాక్స్ డే గా కేంద్రం నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యం లో 10 రోజుల పాటు దేశ వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.