కొత్త విద్యా విధానం ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం

Advertisement

కొత్త విద్యావిధానం-2020 కి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కొత్త విద్యా వ్యవస్థలో చాన్నాళ్లుగా అవసరమైన సంస్కరణలను చేపట్టేందుకు అవకాశం ఏర్పడిందని ఇది ముందు ముందు లక్షల మంది జీవితాలను గొప్పగా ప్రభావితం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అయితే 34 ఏళ్ళ తరువాత కొత్త విద్యా విధానం తేవడానికి దేశం ఎదురు చూస్తుందని, అందుకే విద్యావిధానంపై పలు కీలక మార్పులు చేయనున్నారు. కస్తూరి రంగన్ కమిటీ ఇచ్చిన సూచనలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.

అలాగే ఇక పై 10+2 కి బదులు 5+3+3+4 పద్దతిని ఏర్పాటు చేయనుంది. అలాగే డిగ్రీ ఎన్నాళ్ళు చదవాలన్న విషయాన్నీ విద్యార్థులే నిర్ణయించుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న రెండేళ్లు చదివే డిప్లొమా మరియు మూడు ఏళ్ళు చదివే డిగ్రీ బహుభాషల బోధన వైపుగా కొత్త విద్యా విధానం రానుంది. అలాగే మూడు ఏళ్ళ నుండి 18 ఏళ్ళ వయసు వరకు విద్య తప్పనిసరిగా అభ్యసించాలని అన్నారు. అలాగే మానవ వనరుల శాఖను విద్యా శాఖగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here