“జగన్ మోహన్ రెడ్డి సైకో ఫ్యాన్స్” అదేంటి అంత మాట అనేశాడు??

Ajay G - December 24, 2020 / 12:36 PM IST

“జగన్ మోహన్ రెడ్డి సైకో ఫ్యాన్స్” అదేంటి అంత మాట అనేశాడు??

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.. అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మరీ.. ఎవరిని ఏం అనాలనుకుంటారో అది అనేస్తారు. ఎవ్వరికీ భయపడని మనస్తత్వం ఆయనది. తాజాగా ఆయన చేసిన కొన్ని కామెంట్లు వైరల్ గా మారాయి. చంద్రబాబును పదే పదే తిట్టే జగన్.. చివరకు అదే చంద్రబాబును ఫాలో అవుతున్నరంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అలాగే ఆయన చేసిన జగన్ మోహన్ రెడ్డి సైకో ఫ్యాన్స్ అనే  వ్యాఖ్యలు వైసీపీ పార్టీలోనే చర్చనీయాంశమయ్యాయి.

undavalli arun kumar shocking comments on ap cm jagan

undavalli arun kumar shocking comments on ap cm jagan

ఓవైపు పోలవరం ప్రాజెక్టులోనే అంతా గందరగోళం ఉందంటూ చంద్రబాబు… మరోవైపు కేసులకు భయపడి కేంద్రానికి లొంగుతున్న సీఎం జగన్.. ఇద్దరూ ఏపీని మాత్రం నాశనం చేస్తున్నారంటూ అరుణ్ దుయ్యబట్టారు. అప్పుడేమో.. నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గించి.. ముంపును తప్పించడం కోసం చేసిన బాబు డిజైన్ పై జగన్ విమర్శలు చేసి.. ప్రస్తుతం అదే డిజైన్ తో పోలవరాన్ని నిర్మిస్తున్నారని ఉండవల్లి అన్నారు.

undavalli arun kumar shocking comments on ap cm jagan

undavalli arun kumar shocking comments on ap cm jagan

పోలవరంపై నేను నిజాలు మాట్లాడుతున్నా. కానీ.. జగన్ సైకో ఫ్యాన్స్ మాత్రం నన్ను తీవ్రంగా బెదిరిస్తున్నారు. నేను తప్పు మాట్లాడటం లేదు. నిజం మాట్లాడితే మీకు అంత ఉలుకు ఎందుకు. నేను ఎవ్వరికీ తల వంచను. నేను నా చిన్నతనం నుంచి రాజకీయాలో ఇటువంటివి చాలా చూశాను. నన్ను బెదిరిస్తే.. రెట్టింపు రియాక్షన్ ఇస్తా.. అంటూ వైసీపీ అభిమానులను ఉద్దేశించి అరుణ్ కుమార్ అన్నారు.

బీజేపీ గురించి ఇప్పుడే ఏం మాట్లాడలేను. త్వరలోనే తిరుపతి ఉపఎన్నిక జరుగుతుంది కదా. ఉపఎన్నిక తర్వాత ఏపీలో బీజేపీ ప్రభావం ఎలా ఉంటుందో క్లారిటీ ఇస్తా.. అంటూ చెప్పుకొచ్చారు ఉండవల్లి.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us