అల్లుడి తల నరికి, ఆ తలతో పోలీస్ స్టేషన్ కి వచ్చిన మామ

Advertisement

ఏపీ లోని తూర్పు గోదావరి జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి మండలం డి.జె.పురంలో సొంత అల్లుడి తల తెగ నరికి చంపాడు మామ పల్లా సత్యనారాయణ. అతడి తలను నరికిన అనంతరం సంచిలో వేసుకుని అన్నవరం పోలీస్ స్టేషన్‌కు వచ్చి తానే స్వయంగా లొంగిపోయాడు.

అయితే సత్యనారాయణ కూతురు అనుమానాస్పద స్థితిలో గత సంవత్సరం చనిపోయింది. అప్పటి నుండి ఆమె ఇద్దరి కూతుర్లు తాత అయిన సత్యనారాయణ తో నివసిస్తున్నారు. గత రాత్రి అత్తారింటికి వచ్చిన అల్లుడు, తన భార్యను తానే చంపినట్లు మద్యం మత్తులో మామతో చెప్పాడు. దీనితో తీవ్ర ఆవేశానికి గురి అయిన సత్యనారాయణ ఉదయం తన అల్లుడు తల నరికి అన్నవరం పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here