Auto Driver: చ‌లానాల‌తో వేధింపులు.. త‌న ఆటోకి తానే నిప్పంటించుకున్న డ్రైవ‌ర్

Auto Driver: ట్రాఫిక్ స‌మ‌స్య‌ల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోని పోలీసులు చ‌లానాలో విష‌యంలో మాత్రం చాలా స్ట్రిక్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. చ‌లానాల‌తో దోపిడికి పాల్ప‌డుతున్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించ‌ని వారి ప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌డంలో త‌ప్పు లేదు కాని నిజాయితీగా ఉండే వారి విష‌యంలోను దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చెబుతున్నారు. చ‌లానాల‌తో పోలీసులు వేధించ‌డంతో హనుమకొండలోని కాళోజీ సెంటర్లో ఒక ఆటో డ్రైవర్ త‌న ఆటో తానే కాల్చుకున్నాడు.

Auto Driver

వివ‌రాల‌లోకి వెళితే ఆటో డ్రైవర్ శ్రీనివాస్ అనే వ్య‌క్తి నిర‌స‌న చేప‌డుతూ త‌న ఆటోని తానే కాల్చుకున్నాడు. అతను చెప్పిన కారణం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఫేక్ డాక్యుమెంట్స్‌తో తన ఆటోపై ఫైనాన్స్ తీసుకున్న ఓ వ్యక్తి.. పోలీసుల చేత తనను వేధింపులకు గురిచేస్తున్నాడని ఆటో డ్రైవర్ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ కార‌ణంతోనే త‌న ఆటోను తాను ద‌గ్ధం చేసిన‌ట్టు చెప్పుకొచ్చాడు. వాహనాల రద్దీతో ఉన్న నాలుగు రోడ్ల కూడలిలో ఆటో తగలబడ్డంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో అలజడి రేగింది. ఏం జ‌రిగిందో ఏంటో ఎవ‌రికి తెలియ‌క ఆశ్చ‌ర్య‌పోయారు.అగ్నిమాప‌క సిబ్బంది మంటల‌ని ఆర్పేసారు.ఆటోడ్రైవ‌ర్‌ని అదుపులోకి తీసుకున్నారు.

ఆటో డ్రైవర్ మాత్రం పోలీసులు తనను తీవ్ర మనస్థాపానికి గురిచేశారని, ఆ కార‌ణం వ‌ల్ల‌నే ఇలాంటి ప‌ని చేశానని చెబుతున్నాడు ఆటో డ్రైవ‌ర్. పోలీసులు అన్యాయంగా త‌న‌పై వేధింపులు పాల్ప‌డుతున్నార‌ని ఆరోపిస్తున్నాడు.