Umesh Yadav: ఇదేంద‌య్యా ఉమేష్‌.. ఆ జెర్సీతో బ‌రిలోకి దిగావ్‌..!

Umesh Yadav: ఇంగ్లండ్ వేదిక‌గా భార‌త్‌- ఇంగ్లండ్ మ‌ధ్య ఐదు టెస్ట్‌ల సిరీస్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే.ఇప్ప‌టికే నాలుగు టెస్ట్ లు పూర్తి కాగా ఇందులోఇండియా రెండు గెల‌వ‌గా, ఇంగ్లండ్ ఒక‌టి గెలిచింది. తొలి టెస్ట్ డ్రా అయింది. అయితే మొదటి మూడు టెస్టుల్లో ఉమేశ్‌ యాదవ్‌కు అవకాశం ఇవ్వలేదు. అయితే నాలుగో టెస్టులో మొహ్మద్ షమీ స్థానంలో జట్టులోకి వచ్చాడు.

Umesh Yadav came out wearing in WTC Final Jersey instead of Byju's Jersey
Umesh Yadav came out wearing in WTC Final Jersey instead of Byju’s Jersey

రొటేషన్ పాలసీ, టీ20 ప్రపంచకప్ 2021ని దృష్టిలో ఉంచుకుని షమీకి కెప్టెన్ విరాట్ కోహ్లీ విశ్రాంతిని ఇచ్చాడు. మూడు టెస్టులు ఆడిన ఇశాంత్ శర్మకు కూడా జట్టు మేనేజ్మెంట్ విశ్రాంతిని ఇవ్వగా..ఆయ‌న స్థానంలో శార్ధూల్ ఠాకూర్ వచాడు. ఇక షమీ స్థానంలో వచ్చిన ఉమేశ్‌.. తన బౌలింగ్‌తో అదరగొట్టాడు. నాలుగో టెస్టులో డేవిడ్ మలాన్‌, జో రూట్‌, క్రెయిగ్‌ ఓవర్టన్‌లను ఉమేశ్‌ పెవిలియన్‌ చేర్చాడు.


నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ నైట్‌వాచ్‌మన్ క్రెయిగ్ ఒవెర్టన్ (1)ను ఔట్ చేసిన ఉమేశ్ యాదవ్ తన ఖాతాలో 150వ టెస్టు వికెట్ వేసుకున్నాడు. దాంతో అత్యంత తక్కువ టెస్టుల్లో 150 వికెట్లు పడగొట్టిన ఆరో ఇండియన్ పేసర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఉమేశ్‌కు ఇది 48వ టెస్టు మ్యాచ్. ఉమేష్ భారత్ తరఫున 48 టెస్టులు, 75 వన్డేలు, 7 టీ20లు ఆడాడు.


అత్యంత తక్కువ టెస్టుల్లో 150 టెస్టు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ల జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అగ్రస్థానంలో ఉన్నాడు. కపిల్ 39 మ్యాచుల్లోనే 150 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాతి స్థానాల్లో మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ (40), సీనియర్ ఫేస్ బౌలర్ మహహ్మద్ షమీ (42)లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. 150 వికెట్ల ఫీట్‌ను అందుకున్న టీమిండియా బౌలర్లలో జహీర్‌ ఖాన్‌తో కలిసి ప్రస్తుతం ఉమేశ్‌ యాదవ్ సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు.


అయితే ఉమేష్ యాద‌వ్ త‌ను దిగిన మ్యాచ్‌లో బైజూస్ జెర్సీ కాకుండా వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్ షిప్‌కి సంబంధించిన జెర్సీ ధ‌రించిన‌ట్టు సోష‌ల్ మీడియాలో మీమ్స్ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అంద‌రు బైజూస్ అని రాసి ఉన్న జెర్సీ ధ‌రిస్తే ఉమేష్ మాత్రం ఇండియా అని రాసి ఉన్న జెర్సీ ధ‌రించాడు. ప్ర‌స్తుతం దీనిపై ప‌లు మీమ్స్ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.


2015 ప్రపంచకప్‌లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉమేష్ యాదవ్ నిలిచాడు. ఆ తర్వాత పేలవ ఫామ్ కారణంగా జట్టులో స్థానం కోల్పోయాడు. జస్ప్రీత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, మొహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ లాంటి సీనియర్లు స‌త్తా చాటుతుండ‌డంతో ఉమేష్ కి అవ‌కాశాలు అప్పుడ‌ప్పుడు మాత్ర‌మే వ‌స్తున్నాయి.