Adipurush Movie First Review : ఆదిపురుష్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. వింటే ఫ్యాన్స్ కు మైండ్ బ్లాంకే..!

NQ Staff - June 12, 2023 / 09:56 AM IST

Adipurush Movie First Review : ఆదిపురుష్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. వింటే ఫ్యాన్స్ కు మైండ్ బ్లాంకే..!

Adipurush Movie First Review : ఆదిపురుష్‌.. ఇప్పుడు ఎక్కడ విన్నా సరే ఇదే పేరు ట్రెండింగ్ లో ఉంది. ప్రభాస్ తొలిసారి రాముడిగా చేస్తున్న రామాయణం సినిమా ఇది. ఇందులో సీతగా కృతిసనన్ నటించింది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 16న రాబోతోంది. ఈ క్రమంలో మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.

ఓవర్ సీస్ క్రిటిక్, దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడు అయిన ఉమైర్ సంధు ఈ సినిమా ఫస్ట్ రివ్యూను ఇచ్చేశాడు. ఆయన ఏ పెద్ద సినిమాకు అయినా ఇలాగే ముందు రివ్యూలు ఇస్తుంటాడు. ఇక ఆదిపురుష్ పై పూర్తిగా నెగెటివ్ రివ్యూ ఇచ్చాడు. ఇది చాలా పెద్ద సినిమా అని చెబుతూనే.. ఈ సినిమాలో సోల్ లేదని తేల్చేశాడు.

పైగా ఇందులో నటించిన స్టార్ నటులు పెద్దగా నటించలేదని తెలిపాడు. ప్రభాస్ కు యాక్టింగ్ క్లాసులు అవసరం అంటూ షాకిచ్చాడు. ఇందులో చాలా పెద్ద నటులు ఉన్నారు. కానీ పూర్తిగా ఎఫర్ట్ ను పెట్టలేదు. ఆదిపురుష్ చాలా పెద్ద టార్చర్ మూవీ అని.. బాక్సాఫీస్ వద్ద బ్యాడ్ లక్ కంటిన్యూ అవుతుందని తెలిపాడు.

దాంతో ఈ రివ్యూ చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఉమైర్ సంధుకు ఇచ్చి పడేస్తున్నారు. ప్రభాస్ కు యాక్టింగ్ రాదా.. అసలు నువ్వు ఎవడ్రా చెప్పడానికి.. ఛత్రపతి, చక్రం సినిమాల సమయంలో నువ్వు ఉన్నావారా బచ్చాగా అంటూ క్లాస్ పీకుతున్నారు. నువ్వు నెగెటివ్ రివ్యూ ఇచ్చావంటే కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని అంటున్నారు. చూడాలి మరి ఎలాంటి ఫలితం వస్తుందో.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us