ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య సినిమా రివ్యూ

Advertisement

“కేరాఫ్ కంచరపాలెం” లాంటి సినిమా తో తన సినీ జీవితాన్ని మొదలు పెట్టాడు డైరెక్టర్ వెంకటేష్ మహా. ఈ సినిమాతో మంచి పేరును తెచుకున్నాడు. అయితే ఈ సినిమా తరువాత తెరకెక్కించిన సినిమా రీమేక్ “ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య”. ఈ సినిమా మలయాళంలో “మాహెషింటి ప్రతీకారం” సినిమాకు రీమేక్ గా తీశారు. అలాగే ఈ మలయాళ సినిమాకు 2017 లో అవార్డు కూడా వచ్చింది. ఇక మన తెలుగులో తీసిన ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య సినిమాను నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసారు. మరి సినిమా ఎలా ఉందొ ఒకసారి చూద్దాం.

1)సినిమా కథ;
ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య సినిమా కథలోకి వెళితే అరకులో ఒకే ఒక్క ఫొటోస్టూడియో ” కోమలి ఫోటో స్టూడియో”. ఈ స్టూడియో అధినేత మరియు సీనియర్ ఫోటోగ్రాఫర్ జి. మనోహర్ రావు. ఇతని కుమారుడే ఉమామహేశ్వర రావు అలియాస్ మహేష్ (సత్యదేవ్). అయితే తండ్రి వారసత్వం తో మహేష్ కూడా సాధారణ ఫోటోగ్రాఫర్ గా జీవిస్తుంటాడు. అలాగే ఊర్లో అన్ని కార్యక్రమాలకు ఇతడే ఫోటోగ్రాఫర్ గా పని చేస్తుంటాడు. అలాగే ఇతగాడు మంచి వ్యక్తిత్వం గల మనిషి కూడా. అయితే తను ప్రేమించిన అమ్మాయి స్వాతి (హరి చందన ) తనను వదిలి వెళ్లి పోతుంది. ఈ క్రమంలో జోగి అనే వ్యక్తితో మహేష్ కి వివాదం ఏర్పడుతుంది. జోగి మహేష్ ని తన ఊరి ప్రజల సమక్షంలో అవమానానికి గురి చేస్తాడు. దీనితో మహేష్ జోగిపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటాడు. అయితే ఇదే సమయంలో తన శత్రువు జోగి చెల్లెలు జ్యోతి(రూప కొడవయూర్)తో ప్రేమలో పడతాడు. కాగా మహేష్ తన ప్రతీకారాన్ని, ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అనేది ఈ సినిమా మిగతా కథ.

2)నటీనటుల పాత్రలు
అలాగే ఈ సినిమాలో నటీనటులు అందరు కూడా సాధారణంగా నటించారు. ఒకవైపు సత్యదేవ్ నటనతో ఈ సినిమా తన కెరీర్ లో మంచి సినిమాగా నిలిచిపోతుంది అనే మాటకు సందేహం లేదు. అలాగే హీరోయిన్ కూడా మంచి నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమాలో తన డాన్స్ తో ప్రేక్షకులలో జోష్ నింపింది. అలాగే హీరో తండ్రిగా నటించిన రాఘవన్ నిజ జీవితంలో తండ్రి లాగా తన పాత్రలో మునిగిపోయాడు.

3)సాంకేతిక విభాగం
ఈ సినిమా కెమెరామన్ గా అప్పు ప్రభాకర్ చాలా చక్కగా తీసాడు. విలేజ్ బ్యాక్ గ్రౌండ్ మరియు అరకు అందాలు సినిమాలో ఆహ్లాదకారాన్ని పంచుతాయి. అలాగే మ్యూజిక్ బిజిబాల్ పరవాలేదు అని పించుకున్నాడు. బీజీఎమ్ చాలా బాగుంది.అలాగే డైలాగ్స్ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం ఎందుకంటే డైలాగ్ డెలివరీ చక్కగా ఉంది.

4) విశ్లేషణ
ఈ సినిమాలో సహజమైన పాత్రలు, సత్య దేవ్ అద్భుత నటన, ఆసక్తిగా సాగే ఫస్ట్ హాఫ్ ఆహ్లదకారాన్ని పంచుతాయి. అయితే నెమ్మదిగా సాగే సెకండ్ హాఫ్, ఆకట్టుకోని కథనం, హడావుడిగా ముగించినట్లు ఉండే క్లైమాక్స్ కాస్త నిరాశపరిచింది అని చేప్పుకోవాలి. మొత్తానికి ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా చాలా వరకు ఆకట్టుకుంటుంది. సెకండ్ హాఫ్ కొంచం బాగా తీసి ఉంటే ఫలితం మరింత బాగుండేది. ఈ లాక్ డౌన్ సమయంలో ఇలాంటి విలేజ్ రివేంజ్ డ్రామా సినిమాను చూడొచ్చు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here