Uma Devi: కార్తీక దీపం ఫేం ఉమాదేవి జీవితంలో ఇన్నిక‌ష్టాలా..!

Uma Devi: ప్ర‌ముఖ డైలీ సీరియ‌ల్ కార్తీక దీపంలో ప్ర‌తి క్యారెక్ట‌ర్ బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి చాలా సుప‌రిచితం. ఇందులో దీప స‌వితి త‌ల్లిగా న‌టిస్తున్న భాగ్యం అలియాస్ ఉమాదేవి త‌న న‌ట‌న‌తో ఎంత‌గా అల‌రిస్తున్నారో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈమె సీరియ‌ల్ మొద‌ట్లో విల‌న్‌గా న‌టించి ఇప్పుడు మెల్ల‌మెల్ల‌గా దీప‌కు ఉండ‌గా ఉండే పాత్ర‌లో న‌టిస్తుంది. ప‌లు సినిమాల‌లో సైతం సంద‌డి చేసిన ఉమా దేవి రీసెంట్‌గా స్టార్ మా పరివార్ చాంపియన్షిప్ లో పాల్గొంది.

TheNewsQube-

స్టార్ మా పరివార్ చాంపియన్షిప్ లో కార్తీకదీపం సీరియల్ టీమ్ పాల్గొన‌గా, అందులో డాక్టర్ బాబు, మోనితతో పాటు భాగ్యం ఉన్నారు. డాక్టర్ బాబు ప్రస్తుతం సీరియల్ లో నడుస్తున్న కథ ఆధారంగా ఇద్దరు పిల్లలు తండ్రి కోసం తాపత్రయపడుతున్న విధానాన్ని వేదికపై తన డ్యాన్స్ పర్ఫర్మ్యాన్స్ తో చూపించాడు. ఇక ఈ పర్ఫామెన్స్ తో అక్కడున్న వాళ్ళంతా ఎమోషనల్ అయ్యారు. అయితే భాగ్యం మ‌రింత ఎమోష‌న‌ల్ కాగా, ఆమెను గ‌మ‌నించి శ్రీముఖి త‌న ద‌గ్గ‌ర‌కు పిలిచి ప్ర‌శ్నించింది.

డాక్ట‌ర్ బాబు చూపించిన మాదిరిగానే త‌న జీవితం ఉంద‌ని, తన ఇద్దరు పిల్లలు తన తండ్రి కోసం ఎంతో ఎదురు చూస్తూ బాధ పడుతున్నారని ఎమోషనల్ అయ్యింది. తను భర్తతో విడిపోయినట్టు.. ఇద్దరు ఆడపిల్లలను ఎంతో జాగ్రత్తగా పెంచినట్టు శ్రీముఖి కూడా తనకు సపోర్ట్ ఇస్తున్న‌ట్టు చెప్పుకొచ్చింది.

ఏదేమైన ఆన్‌స్క్రీన్‌పై కనిపించే వారి జీవితాలు రంగులమ‌యంగా ఉండ‌వ‌ని, వారి జీవితంలో క‌ష్ట‌న‌ష్టాలు ఉంటాయ‌ని ఉమాదేవి ద్వారా మ‌రోసారి ప్రూవ్ అయింది.ఓ వైపు త‌న కెరీర్‌తో బిజీగా ఉంటూనే మ‌రోవైపు పిల్ల‌ల భ‌విష్య‌త్ గురించి ఉమాదేవి ఎంత‌గానో తాపత్ర‌య‌ప‌డుతుంది.ఆమె జీవిత విషాద గాథ చాలా మందికి క‌న్నీరు పెట్టించింది.