Parle G: అప్పట్లోనే బ్రిటన్ బిస్కెట్ కంపెనీ లకు షాక్ ఇచ్చిన పార్లే జి.. స్వాతంత్ర్య ఉద్యమం తో ముడిపడిన చరిత్ర..

Parle G(పార్లే జి): బిస్కెట్ అనగానే నోరూరుతుంది.. ఏళ్లుగా మానవుని బ్యాక్ రూపంలో అందుబాటులో ఉన్న ఈ బిస్కెట్లకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉందని చెప్పొచ్చు..  బిస్కెట్ ను ఇప్పుడు ఎన్నో రకాల కంపెనీలు ఎన్నో రకరకాల ఫ్లేవర్స్ తో తయారు చేస్తున్నాయి. అందునా మన చిన్నప్పుడు ఎక్కువగా ఉపయోగించిన పార్లే జీ బిస్కెట్ ను చూస్తే చిన్నప్పటి జ్ఞాపకాలు ఎవరికైనా గుర్తుకు వస్తాయి అని చెప్పవచ్చు.. ఉదయం లేవగానే వేడి వేడి నీటిలో ముంచుకొని ఈ బిస్కెట్ ను ప్రతి ఒక్కరు తినే ఉంటారు..

Uknown Facts About Parle-G Company Biscuits : పార్లే జి
Uknown Facts About Parle-G Company Biscuits

దేశవ్యాప్తంగా అనేక మందికి ఈ బిస్కెట్ తో ఎనలేని బంధమే ఉండి ఉంటుంది..  అయితే ప్రస్తుతం మార్కెట్లో మనకు అనేక రకాల బిస్కెట్లు అందుబాటులో ఉన్న అప్పటికీ పార్లే జీ బిస్కెట్ ఆదరణ ఏమాత్రం తగ్గలేదు అని చెప్పాలి.. స్వతంత్ర ఉద్యమ కాలం నుంచి ఉన్న ఈ పార్లే జీ బిస్కెట్ యొక్క చరిత్ర ప్రస్థానం మొదలైంది ఇప్పుడు చూద్దాం..

 1929వ సంవత్సరంలో స్వదేశీ ఉత్పత్తులను ఎక్కువగా వాడారని ఉద్యమాలు చేస్తున్న రోజుల్లో బ్రిటిష్ కంపెనీ  బిస్కెట్లు అయినా యునైటెడ్,  హంట్లేయ్  ఫామర్స్ , బ్రిటానియా, గ్లాక్సో కంపెనీల బిస్కెట్లు దేశంలో డామినేట్ చేస్తున్నాయి.. దీంతో మనకంటూ ఓ బ్రాండ్ ఉండాలని చెప్పి ముంబై కి చెందిన వ్యాపారి మోహన్ లాల్ జర్మనీ కి వెళ్లి అక్కడ బేకరీ ఐటమ్స్ తయారు చేసే మెళకువలు నేర్చుకుని వచ్చారు.. రాగానే 60 వేలు ఖర్చుపెట్టి బేకరీ యంత్రాలను  ఇండియాకు తెప్పించారు..అలా  ముంబైలో ఇర్లా అండ్ పార్ల అనే ప్రాంతంలో ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి అందులో 12 మంది సిబ్బంది తో పని మొదలు పెట్టాడు.. మొదట్లో ఆరెంజ్ క్యాండీ కాఫీ లను తయారు చేసిన వారు పదేళ్లకు బిస్కెట్లు తయారు చేయడం ప్రారంభించారు.. ఆ కంపెనీ ఉన్న ఫ్యాక్టరీ పేరు పావలా కనుక దానికి క్రమక్రమంగా పార్లే అని పేరు వచ్చింది..  1939వ సంవత్సరంలో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుండగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కంపెనీ గ్రూప్లో పేరిట బిస్కెట్లు తయారు చేసి విక్రయించింది.. అప్పటి నుంచి ప్రజల కంట్లో పార్లే జీ బిస్కెట్ తో కన్నుపడింది.. బ్రిటిష్ బిస్కెట్లు తో పోల్చుకుంటే ఈ బిస్కెట్లు ధర కూడా తక్కువగా ఉండటంతో ప్రజలు దీనికి ఎక్కువ మొగ్గు చూపేవారు..

Advertisement