యుద్ధనౌకల్లో మొట్టమొదటి సారిగా మహిళా ఆఫీసర్లు..!

ప్రస్తుత రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో సత్తాచాటుతున్నారు. ఒకవైపు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఉద్యోగ, వ్యాపార రంగాలతో పాటుగా దేశరక్షణ విభాగం మరిన్ని రంగాల్లో కూడా మహిళలు తమ సత్తా ఏంటో చుపెడ్తున్నారు. అలాగే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నౌకా రంగాల్లో కూడా మహిళలను రిక్రూట్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే యుద్ధ నౌకల్లో ఇప్పటి వరకు కేవలం పురుషులకు మాత్రమే అవకాశం ఉండేది. ఇక ఆ నియమాన్ని మార్పులు చేసి యుద్ధ నౌకల్లో సైతం మహిళలకు సదుపాయం కల్పించారు.

ఇక దింట్లో కొత్తగా ఇద్దరు మహిళలకు అవకాశం లభించింది. అయితే నౌకాదళంలో సబ్ లెఫ్టినెంట్ గా పనిచేస్తున్న కుముది త్యాగి, రీతి సింగ్ లకు ఈ అవకాశం దక్కింది. అలాగే నేవిలోని బహుళ ప్రయోజనాల హెలికాఫ్టర్లను నడపడంలో శిక్షణ పొందారు. అదే విధంగా ఇంటిలిజెన్స్, నిఘా, సెన్సార్లు ఆపరేటింగ్ లో కూడా ఈ మహిళలు శిక్షణ పొందారు. త్వరలోనే ఈ రంగంలో మరికొంతమంది మహిళలను యుద్ధ నౌకల్లోకి చేర్చుకుబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.