అమెరికాలో రెండు విమానాలు ఢీ

Advertisement

అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు విమానాలు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు.అమెరికాలోని సోల్డోట్నా ప్రాంత సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం 8:27 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. ఈ రెండు వివమానాలలో… ఓక విమానంలో పైలట్ ఒక్కరే ఉన్నారు.

అలాగే మరోక విమానంలో ఆరుగురు ప్రయాణం చేస్తున్నట్టు భద్రత అధికారులు వివరించారు.అయితే ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు ప్రమాద స్థలంలోనే మృతిచెందారు. అలాగే మరోక వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించినట్టు అధికారులు పేర్కొన్నారు. మృతిచెందిన వారిలో అలస్కా చట్టసభ సభ్యుడు, రిపబ్లికన్ పార్టీ నేత గ్యారీ నాప్ కూడా ఉన్నారు. ఈ ప్రమాదంపై జాతీయ రవాణా భద్రతా మండలి విచారణ కూడా చేపట్టింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here