Mythri Movie Makers : అయ్యోపాపం మైత్రీ.! చిరంజీవి ఫ్యాన్స్, బాలయ్య ఫ్యాన్స్ మధ్య నలిగిపోతోందే.!
NQ Staff - November 23, 2022 / 09:01 PM IST

Mythri Movie Makers : మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాల్ని నిర్మిస్తోంది. తెలుగు సినీ పరిశ్రమలో బ్యాక్ టు బ్యాక్ ప్రెస్టీజియస్ మూవీస్ నిర్మిస్తోన్న సంస్థ ఏదన్నా వుందంటే ఇప్పుడు అది మైత్రీ మూవీ మేకర్స్ మాత్రమే. ‘పుష్ప ది రూల్’, ‘వాల్తేరు వీరయ్య‘, ‘ వీర సింహా రెడ్డి’.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా చాలా పెద్దదే.
వచ్చే సంక్రాంతికి మైత్రీ నుంచి రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఒకే రోజు.. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద తమ తమ చిత్రాలతో (‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’) తలపడే పరిస్థితి కనిపిస్తోంది.
అభిమానులు ఏకిపారేస్తున్నారు..
చిరంజీవి అభిమానులూ మైత్రీని మెచ్చడంలేదు.. బాలయ్య అభిమానులూ కనికరం చూపడంలేదు. థియేటర్లను ముందు ముందు ఈ సంస్థ ఎలా అడ్జస్ట్ చేయగలుగుతుందో ఏమో.! ఫస్ట్ సింగిల్ ‘వాల్తేరు వీరయ్య’ నుంచి వచ్చింది. ‘వీర సింహా రెడ్డి’ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతోంది.
ప్రమోషన్స్‌లోనే బోల్డంత కన్ఫ్యూజన్ రాబోతోంది ముందు ముందు. దీన్ని మైత్రీ సంస్థ ఎలా డీల్ చేస్తుందో ఏమో.! నిజానికి, అదేమంత పెద్ద టాస్క్ కాదు. అభిమానులతోనే అసలు సమస్య అంతా.
నిజమే.. మైత్రీ సంస్థకి ముందుంది ముసళ్ళ పండగ.