Twitter : ట్విట్టర్ గ్లామర్.! ఏ రంగు టిక్కు కావాలి నాయనా.?
NQ Staff - November 25, 2022 / 09:27 PM IST

Twitter : మామూలుగా అయితే, వెరిఫైడ్ ఖాతా అనగానే ‘బ్లూ టిక్’ గుర్తుకొస్తుంది. సోషల్ మీడియాలో వెరిఫైడ్ ఖాతాలకు ఇచ్చే ‘టిక్’ గురించి అందరికీ తెలిసిందే. అయితే, ఇప్పుడు ఆ ‘టిక్’ రకరకాల రంగుల్లో కనిపించనుంది. వెరిఫైడ్ ఖాతాలకు ఇచ్చే ‘టిక్’ కోసం రంగులు మార్చాలని ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ నిర్ణయించుకున్నాడు.
రంగుల టిక్కులతో ఏం ప్రయోజనం.? అన్నది వేరే చర్చ. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్, తనదైన ప్రత్యేక ముద్రను ట్విట్టర్‌పై వేసేందుకుగాను, ట్విట్టర్ సంస్థని టేకోవర్ చేసినప్పటినుంచీ రకరకాల ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ముచ్చటగా మూడు రంగులట..
ఒకటేమో బంగారం టిక్.. దీన్ని కంపెనీలకు ఇస్తారట. ప్రభుత్వ ఖాతాలకు గ్రే టిక్ వుండబోతోందిట. వ్యక్తులకు (సెలబ్రిటీలు అయినా, కాకపోయినా) బ్లూ టిక్ ఇవ్వబోతున్నారట. ఖాతాదారుల పూర్తి వివరాలను తనిఖీ చేశాయనే వెరిఫైడ్ టిక్ ఇవ్వబోతున్నట్లు మస్క్ ట్వీట్ చేశాడు.
పూర్తి వివరాలు వచ్చే వారం వెల్లడించబోతున్నారట. హింసను ప్రేరేపేించే ఖాతాలను సస్పెండ్ చేస్తామని మస్క్ స్పష్టం చేయడం గమనార్హం.
అదిరిపోయింది కదూ.!ట్విట్టర్ మాత్రమే.. ఇతర సోషల్ మీడియా సంస్థలూ రంగు రంగుల టిక్కుల్ని వెరిఫైడ్ ఖాతాల కోసం ప్రతిపాదిస్తాయా.? జస్ట్ వెయిట్ అండ్ సీ.!