Elon Musk : దిగిపో.! ఎలాన్ మస్క్‌కి తేల్చి చెప్పిన ట్విట్టర్ జనాలు.!
NQ Staff - December 20, 2022 / 01:08 PM IST

Elon Musk : ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్, ఆ పదవిలో కొనసాగాలా.? వద్దా.? అన్న విషయమై నిర్వహించిన పోల్.. ఫాఫం ఆయనకే వ్యతిరేకంగా తీర్పునిస్తోంది.
మెజార్టీ ట్విట్టర్ వినియోగదారులు ట్విట్టర్ నుంచి వైదొలగమంటూ ఆయనకు తేల్చి చెప్పారు. సుమారు 57 శాతానికి పైగా ట్విట్టర్ వినియోగదారులు ఎలాన్ మస్క్ మీద, ఆయన నిర్ణయాల మీదా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మరోపక్క, సుమారు 42 శాతం మంది మాత్రం ఆయనకు మద్దతు తెలిపారు.
ట్విట్టర్ పోల్.. ఎలాన్ పెట్టిన పోల్..
ఇదేదో వేరే చోట జరిగిన పోల్ కాదు.. ట్విట్టర్ వేదికగా.. అందునా, ఎలాన్ మస్క్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ పెట్టిన పోల్‌లో తేలిన విషయం. ట్విట్టర్ మీద ఎలాన్ మస్క్ చూపుతున్న ‘అతి పెత్తనాన్ని’ ట్విట్టర్ వినియోగదారులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు.
అయితే, ఎవరో ఏదో అన్నారని ట్విట్టర్ బాధ్యతల నుంచి ఎలాన్ మస్క్ వైదొలగుతాడని అనుకోగలమా.? అతను మొండితనానికి కేరాఫ్ అడ్రస్. అందరూ వద్దన్నాసరే, అదే చేస్తానంటాడు. అయినా, వందల కోట్లు.. వేల కోట్లు వెచ్చించి ‘ట్విట్టర్’ని కొనగులు చేసింది, దాని బాధ్యతల నుంచి తప్పుకోవడానికైతే కాదు కదా.!