Smita Sabharwal : స్మితా సబర్వాల్‌ ఇంట్లోకి అగంతకుడు.. అసభ్యకరంగా ప్రవర్తిస్తూ దారుణం..!

NQ Staff - January 22, 2023 / 11:52 AM IST

Smita Sabharwal : స్మితా సబర్వాల్‌ ఇంట్లోకి అగంతకుడు.. అసభ్యకరంగా ప్రవర్తిస్తూ దారుణం..!

Smita Sabharwal : తెలంగాణ ప్రభుత్వంలో అత్యంత కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న స్మితా సబర్వాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఇందుకు సంబంధించిన ఘటనను ఆమె ట్విట్టర్‌ వేదికగా పంచుకుంది. గత రాత్రి ఆమె ఇంట్లోకి ఓ అగంతకుడు చొరబడ్డాడు. మేడ్చల్‌ జిల్లాకు చెందిన డిప్యూటీ తహసీల్దార్‌ చెరుకు ఆనంద్‌ కుమార్‌ రెడ్డి తన స్నేహితుడితో కలిసి కారులో స్మితా సబర్వాల్‌ ఇంటికి వచ్చాడు.

జూబ్లీహిల్స్‌ ఏరియాలో నివసిస్తున్న స్మితా ఇంట్లోకి అర్థరాత్రి 11, 12 గంటల సమయంలో వచ్చాడు. ఏదో ఉద్యోగ విషయంలో మాట్లాడటానికి వచ్చానంటూ చెప్పాడు. అయితే కాసేపటికే ఆయన అసభ్యకరంగా ప్రవర్తించడం స్టార్ట్‌ చేశాడు. దాంతో ఆయన ఉద్దేశం స్మితా సబర్వాల్‌ కు అర్థమైంది.

అరెస్ట్ చేసిన పోలీసులు..

వెంటనే కేకలు వేస్తూ అరవడంతో అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అలెర్ట్‌ అయింది. ఆనంద్‌ కుమార్ రెడ్డితో పాటు ఆయన స్నేహితుడిని పట్టుకుని జూబ్లీహిల్స్‌ పోలీసులకు అప్పగించారు. వారి కారును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై స్మితా సబర్వాల్‌ ఫిర్యాదు ఇచ్చింది.

ఇక ఆమె ట్విట్టర్‌ లో ఈ విషయంపై స్పందించింది. అప్రమత్తంగా ఉండటం వల్లే నా ప్రాణాలను కాపాడుకున్నాను. మీరు కూడా అలెర్ట్ గా ఉండండి. మీ తలుపులు, తాళాలను చెక్‌ చేసుకోండి. ఏదైనా సమస్య వస్తే వెంటనే ఎమర్జెన్సీ నెంబర్‌ 100కు డయల్‌ చేయండి అంటూ తెలిపింది స్మితా సబర్వాల్‌.

 

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us