టిక్ టాక్ ను కొనుగోలు చేసే ఆలోచనలో ట్విట్టర్

Advertisement

చైనా కు చెందిన యాప్స్ ను భారత ప్రభుత్వం నిషేదించింది. అయితే దింట్లో ప్రముఖంగా ఉన్న టిక్ టాక్ యాప్ ను కూడా నిషేదించింది భారత్. అయితే భారత్ బాటలోనే అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలు కూడా టిక్ టాక్ ను నిషేధించే ఆలోచనలో ఉన్నాయి. అయితే ఈ టిక్ టాక్ ను కొనడానికి అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ పేరు కూడా వినిపిస్తుంది.

అలాగే ట్విటర్‌తో టిక్‌టాక్ చర్చలు జరుపుతుందని వార్తలు వస్తున్నాయి. మైక్రోసాఫ్ట్‌తో పోలిస్తే ట్విట్టర్ చిన్న సంస్థ కావడంతో ట్విటర్-టిక్‌టాక్ ఒప్పందానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి అభ్యంతరం రాకపోవచ్చని అమెరికా వ్యాపార విశ్లేషకులు అంటున్నారు. టిక్‌టాక్‌ను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అయితే టిక్‌టాక్ మాత్రం ట్విట్టర్ తో వస్తున్న వార్తలపై ఎటువంటి విషయం స్పందించడం లేదు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here