Twitter : ట్విట్టర్ పెయిడ్ వెరిఫికేషన్.. మస్క్ దిమ్మ తిరిగిందా?
NQ Staff - November 14, 2022 / 10:09 AM IST

Twitter : ట్విట్టర్ ని కొనుగోలు చేసిన తర్వాత ఎలాన్ మస్క్ ఎన్నో విప్లవాత్మక మార్పులను చేపట్టిన విషయం తెలిసిందే. ఉద్యోగులను సగానికి పైగా తొలగించాలని నిర్ణయించుకున్నాడు. అంతే కాకుండా ఆదాయ మార్గాలను అన్వేషిస్తూ పెయిడ్ వెరిఫికేషన్ సర్వీస్ ని మొదలు పెట్టాడు.
ట్విట్టర్ మొదటి యాజమాన్యం తీసుకు వచ్చిన అనేక షరతులను, నిబంధనలను మారుస్తూ వినియోగదారులకు చుక్కలు చూపించడం మొదలు పెట్టాడు. దాంతో తక్కువ సమయంలోనే ట్విట్టర్ ని వదిలేసి ఎంతో మంది వినియోగదారులు వెళ్లి పోయారు.
పలు దేశాల్లో ట్విట్టర్ యొక్క సేవలు నిలిచి పోవడం తో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయింది. ట్విట్టర్ కొనుగోలు వ్యవహారమై జరుగుతున్న చర్చల సందర్భంగానే ట్విట్టర్ కి భారీ లాభాలు వచ్చాయి. కానీ మస్క్ తీసుకున్న నిర్ణయాల వల్ల నష్టాల బారిన పడింది అంటూ మార్కెట్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.
ఇటీవల ట్విట్టర్ యొక్క సర్వీసులు చాలా దేశాల్లో నిలిచి పోయాయి. ఈ నేపద్యంలో ఎలాన్ మస్క్ వినియోగదారులకు క్షమాపణలు చెప్పడంతో పాటు 8 డాలర్ల పెయిడ్ వెరిఫికేషన్ సర్వీస్ ని ఉప సంహరించుకుంటున్నట్లుగా కూడా ప్రకటించారు.
మొత్తానికి ట్విట్టర్ మళ్లీ పూర్వ వైభవం దక్కించుకునేందుకు మస్క్ ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ సంస్థకు చెందిన కొందరు ప్రతినిధులు మాట్లాడుకుంటున్నారు.