అదుపు తప్పి లోయలో పడ్డ ఎయిర్ ఇండియా విమానం , 20 మంది మరణం

Advertisement

కేరళ: కేరళలోని కోజికోడ్ విమానాశ్రమంలో ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం రన్ వే పై నుండి అదుపుతప్పి 35 అడుగుల లోయలో పడింది. ఈ ప్రమాదంలో 19 మంది మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ఇండియాకు తీసుకురావడానికి చేపట్టిన ‘వందే భారత్ మిషన్’ కార్యక్రమంలో భాగంగా ఎయిర్ ఇండియాకు సంబంధించిన బోయింగ్ 737(ఫ్లైట్‌ ఐఎక్స్‌ 1344) దుబాయ్ నుండి కేరళకు బయలుదేరింది.

కోజికోడ్ లోని రన్ వే-10పై క్షేమంగానే ల్యాండ్ అయిన విమానం తరువాత ఆగకుండా రన్ వే చివరి వరకు వెళ్లి అక్కడ ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో పైలట్ దీపక్ సాధే, కో పైలట్ ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నానని మోదీ తెలిపారు. ఈ ఘటనపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, రాష్ట్రపతి రాంనాథ్ కొవింద్, వెంకయ్య నాయుడు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here