Heart Attack : 12 ఏళ్ళ బాలుడికి గుండె పోటు.! హఠాన్మరణంపై వైద్య వర్గాల విస్మయం.!
NQ Staff - January 9, 2023 / 10:50 AM IST

Heart Attack : ఒకప్పుడు గుండె పోటు అంటే.. అరవై, డెబ్భయ్ ఏళ్ళు పైబడినవారికి మాత్రమే వచ్చేది.! కానీ, రోజులు మారాయ్. యుక్త వయసులోనూ గుండెపోటుతో మరణిస్తున్నారు. కారణలేంటి.? అన్నది మాత్రం అంతు బట్టడంలేదు.
కోవిడ్ నేపథ్యంలో చిన్న వయసులో గుండె పోటు అనేది సర్వసాధారణమైపోయింది. వ్యాక్సిన్ల ప్రభావమేనంటూ వైద్య వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. సాధారణ ప్రజానీకంలో భయాందోనలు పెరుగుతున్నాయి. అయితే, మారిన జీవన శైలి, మారుతున్న ఆహారపు అలవాట్లు.. ఇవే గుండెపోటుకి కారణమని వైద్య వర్గాలు చెబుతున్నాయి.
పన్నెండేళ్ళకే.. గుండె విలవిల..
కర్నాటకలో పన్నెండేళ్ళ చిన్నారికి గుండె పోటు వచ్చింది. బాధతో విలవిల్లాడాడు. తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు. కానీ, ఆ చిన్నారి ప్రాణం దక్కలేదు. కర్నాకటలోని మడికేరి జిల్లాలో ఈ ఘటన జరిగింది.
కుశాలనగర తాలూకా కూడు మంగళూరులో పాఠశాల బస్సు డ్రైవర్‌గా పనిచేసే మంజూచారి కీర్తన్, ఆరో తరగతి చదువుతున్నాడు. శనివారం సాయంత్రం ఆడుకుని, రాత్రి కావస్తుండడంతో ఇంట్లోకి వచ్చాడు. కాస్సేపటికే గుండపోటు వచ్చింది. ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వెల్లడించారు వైద్యులు. అంతకు ముందు కీర్తన్‌కి ఎలాంటి అనారోగ్య సమస్యలూ లేవని తల్లిదండ్రులు చెబుతున్నారు.
ఇటీవలి కాలంలో ఇలా పది పన్నెండేళ్ళ వయసులో గుండె పోటు ఘటనలు తరచుగా వెలుగు చూస్తున్నాయి. గత పది పదిహేను రోజుల్లోనే ఇది రెండో ఘటన.