నటి శ్రావణి ఆత్మహత్యకు ముందు ఏమి జరిగింది?

Admin - September 16, 2020 / 09:32 AM IST

నటి శ్రావణి ఆత్మహత్యకు ముందు ఏమి జరిగింది?

మౌనరాగం, మనసు మమత వంటి సీరియల్స్ లో నటించిన శ్రావణి ఈ నెల 8న తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె ఆత్మహత్య చేసుకున్న తరువాత ఆమె మృతి పై అనేక అనుమానాలు వెల్లువెత్తాయి. కుటుంబ సభ్యులు తమ కుమార్తె మరణానికి దేవరాజు రెడ్డి అనే వ్యక్తి కారణమని పోలీసులకు వెల్లడించారు. అయితే ఇప్పుడు పోలీసులు విచారణలో అతను A3 గా ఉన్నారు. మిగితా ఇద్దరు ఎవరు? వాళ్ళతో శ్రావణికి ఉన్న సంబంధం ఏంటి ? శ్రావణి ఎవరిని ప్రేమించింది?

సీరియల్స్ ప్రస్థానం:

2012లో నటి కావాలని కలలు కంటూ శ్రావణి హైదరాబాద్ వచ్చింది. సినిమాల్లో, సీరియల్స్ లో ఛాన్స్ లకోసం వెతుకుతూ ఉన్నారు. 2015లో సాయి కృష్ణ రెడ్డి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అప్పటి నుండి వాళ్ళిందరు స్నేహంగా ఉండేవారు. అలాగే 2017లో అశోక్ రెడ్డి అనే ఒక నిర్మాతతో కూడా శ్రావణికి పరిచయం ఏర్పడింది. అలాగే 2019 ఫిబ్రవరిలో దేవరాజు రెడ్డి అనే వ్యక్తితో టిక్ టాక్ ద్వారా పరిచయం ఏర్పడింది. దేవరాజుతో ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. ఈ ప్రేమను జీర్ణించుకోలేని సాయి కృష్ణ రెడ్డి, అశోక్ రెడ్డి ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించారు. అలాగే దేవరాజుకు దూరంగా ఉండాలని కుటుంబ సభ్యులు కూడా ఆమెను మందలించారు. దేవరాజు రెడ్డిని సాయి కృష్ణా రెడ్డి ఒకసారి మనుషుల చేత కొట్టించాడు.

దేవరాజుకు శ్రావణి పెళ్లి చేసుకోవాలని అనుకుందా!

మొదట స్నేహితులుగా ఉన్న శ్రావణి, దేవరాజు తరువాత ప్రేమికులుగా మారారు. శ్రావణి ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రోజు కూడా దేవరాజుతో శ్రావణి ఫోన్ లో మాట్లాడుతూ అన్నవరం వెళ్లి పెళ్లి చేసుకుందామని కూడా చెప్పింది. అయితే ఆమెకు గతంలో సాయి కృష్ణ రెడ్డి, అశోక్ రెడ్డిలతో సంబంధాలు ఉన్నాయని భావించిన దేవరాజ్ పెళ్లికి నిరాకరించారు.

శ్రావణి మృతి కారణం ఎవరు?

శ్రావణి ఆత్మహత్య చేసుకోవడానికి కారకులైన సాయి కృష్ణ రెడ్డిని A1 గా, అశోక్ రెడ్డిని A2 గా, దేవరాజును A3 గా పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా సాయి కృష్ణ రెడ్డి, అశోక్ రెడ్డిలు పెట్టిన టార్చర్ వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు వెల్లడించారు. ఈ ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల నుండి తప్పించుకుంటున్న అశోక్ రెడ్డిని ఇవ్వాళ అదుపులోకి తీసుకున్నారు .

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us