Turkey Crying : కోసుకొని తింటారేమో అని విల‌పించిన ట‌ర్కీ కోడి

Turkey Crying : ఆదివారం వ‌చ్చిందంటే మ‌న‌కు చికెన్ ముక్క దిగాల్సిందే. కోడిని హింసించి బాధ‌పెట్టి మ‌నం ఆనందం పొందుతున్నాం. మ‌నం చికెన్ హ్యాపీగా తింటాం కాని, ఆ సమ‌యంలో కొడి తినే బాధ ఎలా ఉంటుందో ఎవ‌రు ఆలోచించ‌రు. ఇంకొంద‌రు అసలు తిన‌రు. ఎందుకంటే.. ఒక ప్రాణిని చంపి దాన్ని హింసించి తినడం ఏమిటని వారి అభిప్రాయం కావొచ్చు. ఈ నేప‌థ్యంలో సోష‌ల్ మీడియాలో ఓ వీడియో వైర‌ల్‌గా మారింది.

Turkey Crying a day before thanks giving goes viral
Turkey Crying a day before thanks giving goes viral

ఆ వీడియోలో కోడి ఏడుస్తూ ఆశ్యర్యపరుస్తుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా దేశాల్లో థ్యాంక్స్‌గివింగ్ డే పెద్ద పండుగ‌గా జ‌రుపుకుంటారు. ఈ రోజు చాలా మంది కచ్చితంగా ట‌ర్కీ చికెన్‌ను తింటారు. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఈ క్ర‌మంలో కోడి బాధ‌ప‌డే బాధ చూసి అంద‌రు క‌న్నీరి ప‌ర్యంతం అవుతున్నారు.

నవంబర్ 24న జాన్ ఒబెర్గ్ అనే ట్విట్టర్ యూజర్.. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘ఎవరైనా టర్కీ చికెన్ తినాలని ప్లాన్ చేస్తే, ఈ వీడియో చూసిన తర్వాత వారు తమ అభిప్రాయాలను మార్చుకుంటారు.’’ అని క్యాప్షన్ పెట్టారు. జాన్ షేర్ చేసిన ఈ పోస్ట్‌ను సుమారు వేలాది మంది రీట్వీట్ చేయగా, 2.5 వేల మంది దీన్ని లైక్ చేశారు.

60 వేల మంది వరకు వీక్షించారు. సాధారణంగా ఫుడ్, డ్రింక్స్ విషయంలో ప్రతి ఒక్కరికీ వారి స్వంత అభిప్రాయం ఉంటుంది. కొందరికి నాన్ వెజ్ అంటే ఇష్టం, మరికొందరికి వెజ్ అంటే ఇష్టం. చాలా మంది చికెన్ తినడానికి ఇష్టపడతారు. అయితే జాన్ ఒబెర్గ్ చేసిన ఈ వీడియో పోస్ట్ తర్వాత, చాలా మంది మాంసాహారులు కూడా ఎమోషనల్ అయ్యారు. తమ అభిప్రాయాన్ని మార్చేసుకున్నారు.

థ్యాంక్స్ గివింగ్ వేడుకల్లో టర్కీని కోడిని తినడం సంప్రదాయం. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారితీసింది. కొందరు మాంసాహారం తీసుకోవడం తప్పేం లేదని గట్టిగా వాదిస్తే మరి కొందరు మాత్రం శాఖాహారానికే ఓటు వేశారు. ‘‘ఈ వీడియోను చూస్తే నాకూ కన్నీళ్లు ఆగలేదు’’ అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశారు