కరోనాను జయించిన హరీష్ రావు

Advertisement

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కరోనా నుండి కోలుకున్నారు. అయితే తాజాగా ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా నెగెటివ్ అని తేలింది. దీంతో ఆయన సోమవారం నుండి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 7వ తేదీ నుండి మొదలవుతున్నందున అందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలన్న స్పీకర్ సూచన మేరకు మంత్రి హరీష్ రావు కూడా టెస్ట్ చేయించుకున్నారు. అయితే ఆయనకు కరోనా లక్షణాలు లేనప్పటికీ పాజిటివ్ అని తేలింది. దీనితో ఆయన వైద్యుల సూచనల మేరకు క్వారంటైన్ కి వెళ్లి చికిత్స తీసుకున్నాడు. ఇక మొత్తానికి కరోనా ను జయించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here