మంత్రి హరీష్ రావుకు కరోనా పాజిటివ్

Advertisement

తెలంగాణాలో కరోనా ఎవ్వరిని వదలడం లేదు. ఒకవైపు రాజకీయ నాయకులను సైతం కరోనా భయబ్రాంతులకు గురిచేస్తుంది. తాజాగా తెలంగాణ ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు కరోనా బారిన పడ్డారు. అయితే ఆయనకు కరోనా లక్షణాలు ఉండడడంతో టెస్టులు చేయించుకున్నాడు. దీనితో రిపోర్టుల్లో కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయినట్టు ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. అలాగే ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని పేర్కొన్నాడు. అలాగే కొన్ని రోజులుగా తనను కలిసిన వారు కూడా కరోనా టెస్టులు చేయించుకొని, హోమ్ క్వారంటైన్ లో ఉండాలని హరీష్ రావు సూచించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here