తెలంగాణ సర్కార్ పై మరోసారి హై కోర్ట్ సీరియస్

Advertisement

తెలంగాణ సర్కార్ పై హై కోర్ట్ మరోసారి సీరియస్ అయ్యింది. కరోనా టెస్టుల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ప్రతి రోజు హెల్త్ బులిటెన్ లో 8 నుండి 10 మంది మాత్రమే మరణిస్తున్నారా అని ప్రశ్నించింది. అలాగే కరోనా కేసులు తక్కువ చేసి చూపిస్తున్నారని మండిపడింది. కచ్చితమైన రిపోర్టులు ఇవ్వాలని ఆదేశించింది. తప్పుడు నివేదికలు ఇస్తే చీఫ్ సెక్రటరీని మళ్ళి కోర్టు కు పిలవాల్సి వస్తున్నాడని అన్నారు.

అన్ని నివేదికలను ఈ నెల 22వ తేదీ లోగా సమర్పించాలి అని తెలిపింది. అలాగే ప్రవేట్ ఆసుపత్రుల పై అధిక బిల్లులపై 22వ తేదీన రిపోర్ట్ ఇవ్వాలని సూచించింది. అసలు ప్రవేట్ ఆసుపత్రులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. ఇప్పటి వరకు ప్రజల హెల్త్ పై పెట్టిన ఖర్చుల వివరాలను ఇవ్వాలని ఆదేశించింది. ఇక తుదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి కోర్ట్ వాయిదా వేసింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here