ప్రైవేట్ హాస్పిటల్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి ఈటెల

Advertisement

హైదరాబాద్: ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా నేపథ్యంలో జరుగుతున్న మోసలపై మంత్రి ఈటెల రాజేందర్ ఘాటుగా స్పందించారు. ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం చేస్తున్న ఆకృత్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చు అవ్వదని, కేవలం పది వేల రూపాయలు సరిపోతాయని తెలిపారు. కృత్రిమ కొరత సృస్థించి, అధిక ఫీజులు వసూలు చేస్తున్న వారి పై త్వరలోనే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. చనిపోయిన తరువాత ఫీజు కట్టకపోతే శవాన్ని ఇవ్వమని చెప్తూ, వాళ్లలోని రాక్షసత్వానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. కరోనా సోకిన వాళ్ళు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చికిత్స పొందాలని, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృధా చేసుకోవడాని హితువు పలికారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు సరిగ్గా లేకపోవడం వల్లే ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తుందని సామాన్య ప్రజలు వాపోతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకునే ముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు మెరుగుపరచాలని ప్రజలు కోరుతున్నారు.
మంత్రి ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు కరోనా బాధితుల కుటుంబానికి కొంత ఊరట కలిగించింది. కరోనా పేరుతో అధిక ఫీజులు గుంజుతున్న సామాన్య ప్రజలు నిలదీయడానికి మంత్రి మాటలు ధైర్యాన్నిచ్చాయి. కృత్రిమ కొరతను సృష్టిస్తూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ యాజమాన్యానికి మంత్రి ఈటెల మాటలు భయాన్ని పట్టిస్తున్నాయి. అక్రమాలకు పాల్పడ్డ ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామన్న మంత్రి, ఆచరణలో కూడా చూపించి, ప్రైవేట్ ఆసుపత్రుల ఆగడాలను అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here