రాజ్ భవన్ లో జెండా ఆవిష్కరించిన గవర్నర్ తమిళిసై

Advertisement

స్వాతంత్య్ర దినోత్సవం ను పురస్కరించుకొని రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అయితే కరోనా దృష్ట్యా భౌతిక దూరం పాటిస్తూ వేడుకలు నిడంబరంగా జరిగాయి. అయితే అధికారులు, ఇతర సిబ్బంది అందరు కూడా నిబంధనల ప్రకారం నిలుచున్నారు. ఇక వారి వద్దకు స్వయంగా గవర్నర్‌ వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే పోలీసు సిబ్బందికి స్వయంగా స్వీట్‌లు పంచారు గవర్నర్. రాజ్‌భవన్‌లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో గవర్నర్‌ సలహాదారులు రిటైర్డ్‌ ఎపివిఎస్‌శర్మ, ఎకె మహంతి, గవర్నర్‌ కార్యదర్శి సురేంద్ర మోహన్‌, జాయింట్‌ సెక్రటరీలు భవానీశంకర్‌, రఘు ప్రసాద్‌, అనుసంధాన అధికారి సీతారాములు మరియు డా.రాజారామ్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here