తెలంగాణ సర్కార్ కు గవర్నర్ తమిళిసై లేఖ

Advertisement

తెలంగాణ సర్కార్ కు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ లేఖ రాసారు. అయితే గవర్నర్ కు వస్తున్న ఫిర్యాదులను తెలంగాణ ప్రభుత్వానికి పంపిస్తుంది. తాజాగా వచ్చిన మరి కొన్ని ఫిర్యాదులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లింది. అయితే స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధుల భర్తల పెత్తనంపై గవర్నర్‌కు కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. ఇక ఈ విషయం పై స్పందించిన తమిళిసై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టాలని లేఖ రాశారు.

అయితే గవర్నర్ రాసిన లేఖపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. అధికారిక కార్యక్రమాల్లో, సమావేశాల్లో మహిళా ప్రజాప్రతినిధుల భర్తలు, ఇతర బంధువులు పాల్గొనకుండా చూడాలని కలెక్టర్లకు మరియు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ లకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రాజకీయ పార్టీల నేతలు, ఇతర వ్యక్తులు ఏదైనా అంశాన్ని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దృష్టికి తీసుకొస్తే వెంటనే వాటిపై ఫోకస్ చేసి సమస్యలను ప్రభుత్వానికి తెలుపుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here