ఈ నెల 20నుండి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు డిజిటల్ తరగతులు

Advertisement

హైదరాబాద్: ఈనెల 20 నుండి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న 6-10 విద్యార్థులకు దూరదర్శన్, టీ షాట్ చానెల్స్ ద్వారా డిజిటల్ తరగతులను నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్ర రెడ్డి తెలిపారు. విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశమై ప్రవేశ పరీక్షలు, పరీక్షలు, విద్యా సంవత్సరంపై కీలకంగా సమీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సెప్టెంబర్‌ 1 నుంచి 3-5 తరగతుల విద్యార్థులకు డిజిటల్‌ తరగతులు ఉంటాయన్నారు. ఈ నెల 17 నుంచి ఇంటర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తామన్నారు. సెప్టెంబర్‌ 1 తర్వాత ఇంటర్‌ ప్రవేశాల ప్రక్రియ ఉంటుందని చెప్పారు. ఈ నెల 31న ఈ సెట్‌, సెప్టెంబర్‌ 2న పాలిసెట్‌ నిర్వహిస్తామని తెలిపారు. అలాగే, సెప్టెంబర్‌ 9, 10, 11, 14న ఎంసెట్‌ నిర్వహించాలని భావిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు.

హై కోర్టు అనుమతి ఇస్తే ఇన్ని ప్రవేశ పరీక్షలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని సబితా తెలిపారు. ఇప్పటికే ఈ ప్రవేశ పరీక్షలకు షెడ్యూలును నిర్ణయించినప్పటికి కరోనా విజృంభన వల్ల అన్ని వాయిదా పడిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here