తెలంగాణాలో కొత్తగా 2,534 కరోనా కేసులు

Advertisement

తెలంగాణాలో కరోనా రోజురోజుకు ఉగ్రరూపం దాల్చుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇది ఇలా ఉంటె తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసారు. అయితే తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 2,534 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దాంట్లో 11 మంది మృతి చెందారు. అలాగే 2,071 మంది డిశ్చార్జ్ అయ్యారు.

ఇక దీనితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,50,176 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే 927 మరణాలు సంభవించాయి. అలాగే ప్రస్తుతం తెలంగాణలో 32,106 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే ఇప్పటి వరకు చికిత్స పొంది 1,17,143 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here