ఒకే వ్యక్తి రెండుసార్లు ఓటు వేయాలి: డోనాల్డ్ ట్రంప్

Advertisement

అమెరికాలో ఎన్నికల హడావిడి స్టార్ట్ అయ్యింది. నవంబర్ లో జరగనున్న ఎన్నికల కోసం డోనాల్డ్ ట్రంప్ విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ ప్రజలు మెయిల్‌-ఇన్‌ పద్ధతిలో ఓటు నమోదు చేసుకున్న తర్వాత మరోసారి పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి కూడా ఓటు వేయాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అమెరికాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఒక దేశ అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ ఇలాంటి చట్ట వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం తగదని అమెరికన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి చట్టవిరుద్ధ కార్యకలాపాల్ని ప్రోత్సహిన్నారంటూ ఆయన ప్రత్యర్థి వర్గం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ఒకే వ్యక్తి రెండుసార్లు ఓటు వేయడమనేది చట్ట వ్యతిరేకమైన చర్య, అలాగే రెండు సార్లు ఓటు వేయమని చెప్పడం కూడా అమెరికాలో నేరంగా పరిగణిస్తారు. ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో ట్రంప్ దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు. వీలైనంత త్వరగా మెయిల్‌-ఇన్‌ పద్ధతిలో ఓటు వేయాలని, ఒకవేళ అది నమోదు కాకుంటే పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటేయాలని సూచించానే తప్ప రెండుసార్లు ఓటువేయమని తాను చెప్పలేదని ట్రంప్ ట్వీట్ చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here