కరోనా వ్యాక్సిన్ కు చేరువలో ఉన్నాం: ట్రంప్

Advertisement

కరోనా వల్ల ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. ప్రపంచ దేశాలన్నీ ఇప్పటికి ఇళ్లకే పరిమితం అయ్యాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచం మొత్తం కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వ్యాక్సిన్ సిద్ధమైందని రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ కు అమెరికా కూడా చేరువలో ఉందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.

కొవిడ్‌-19 కట్టడి కోసం ఆక్స్‌ఫర్డ్‌తో కలిసి ఆస్ట్రాజెనెకా కంపెనీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ అమెరికాలో మూడో దశకు చేరుకున్నాయని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. ప్రజా వినియోగానికి తుది ఆమోదం పొందడానికి అతి దగ్గరలో ఉందని ప్రకటించారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఆస్ట్రాజెనెకా సైతం స్పందించింది. అమెరికా వ్యాప్తంగా 80 నగరాల్లో వివిధ ప్రయోగ కేంద్రాలు 30 వేల మంది వాలంటీర్లను నమోదుచేసుకున్నామని, వీరంతో 18 ఏళ్ల పైబడినవారేనని, అలాగే వివిధ సంస్కృతులు, జాతులు, భౌగోళిక ప్రాంతాలకు చెందిన వారు వీరిలో ఉన్నారని తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here