టిక్ టాక్ కు ఒక అవకాశం ఇచ్చిన ట్రంప్

Advertisement

వాషింగ్టన్: షార్ట్ ఫార్మాట్ వీడియోస్ కు ప్రసిద్ధి చెందిన టిక్ టాక్ ను ఇండియన్ ప్రభుత్వం దౌత్యపరమైన విషయాలు దృశ్య బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ యాప్ అమెరికన్స్ యొక్క వ్యక్తిగతమైన సమాచారం సేకరిస్తుందనే కారణంతో ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా ఈ యాప్ ను నిషేధించాలని సంబంధిత అధికారులతో చర్చలు జరుపుతున్నారు.

అయితే ట్రంప్ టిక్ టాక్ కు ఒక అవకాశం ఇచ్చాడు. అదేంటంటే టిక్ టాక్ సంస్థను అమెరికా సంస్థలకు అమ్మేస్తే దానిపై నిషేధం విధించమని ట్రంప్ ప్రకటించాడు. టిక్ టాక్ ను కొనుగోలు చేయడానికి సాఫ్ట్వేర్ దిగ్గజమైన మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రయత్నాలు చేస్తుంది. టిక్ టాక్ కు సంబంధించిన భద్రతాపరమైన విషయాల పై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ట్రంప్ తో చర్చలు జరుపుతున్నారు . ఈ చర్చలు సఫలమైతే అమెరికా యొక్క టిక్ టాక్ వ్యవహారాలను మైక్రోసాఫ్ట్ సొంతం చేసుకోనుంది. టిక్ టాక్ వల్ల చాలామంది యువత తమ ప్రతిభను చాటుకున్నారు. అయితే కొంతమంది మాత్రం అసభ్యకరమైన వీడియోస్ పోస్ట్ చేసేవాళ్ళు. మధ్య తరగతి యువతకు తమ ప్రతిభను చూపించుకోవడానికి టిక్ టాక్ ఒక మంచి అవకాశం.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here