Minister Mallareddy : గులాబీ పార్టీలో మంత్రి మల్లారెడ్డి రాజేసిన కుంపటి.!
NQ Staff - December 20, 2022 / 09:58 AM IST

Minister Mallareddy : భారత రాష్ట్ర సమితిగా మారిన తెలంగాణ రాష్ట్ర సమితిలో కుంపటి రాజుకుంది. మంత్రి మల్లారెడ్డి ఈ కుంపటికి కారణమని, కుంపటి రాజేసిన గులాబీ పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అంటున్నారు. ఆయన నివాసంలో అరికెపూడి గాందీ, వివేక్ గౌడ్, మాధవరం కృష్ణారావు, సుభాష్ రెడ్డి తదతర ఎమ్మెల్యేలు భేటీ అయిన సంగతి తెలిసిందే.
మంత్రి మల్లారెడ్డి మోనార్క్‌లా వ్యవహరిస్తారనీ, తనకు నచ్చినవారికి పదవులు ఇచ్చుకుంటున్నారనీ, తద్వారా క్యాడర్ని దెబ్బ తీస్తున్నారనీ, తద్వారా పార్టీ నష్టపోతోందని మైనంపల్లి హన్మంతరావు ఆరోపించారు.
తన ఇంట్లో ఎమ్మెల్యేలు భేటీ అయ్యింది కార్యకర్తల బాగు కోసం తప్ప, ఎవరి మీదనో అక్కసుతో కాదని మైనంపల్లి చెప్పుకొచ్చారు.
పార్టీ భవిష్యత్తు కోసమే..

TRS Party MLAs Expressed Anger On Minister Mallareddy
‘ఈ సమావేశం నా కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసమంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇందులో వాస్తవం లేదు. పార్టీని భ్రష్టుపట్టించేలా మంత్రి మల్లారెడ్డి వ్యవహరిస్తున్నారు.
ఈ పరిస్థితిని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీయార్ దృష్టికి తీసుకెళ్ళాలనుకున్నాం.. కానీ, పరిస్థితులు అనుకూలించలేదు..’ అంటున్నారు మైనంపల్లి.
మల్లారెడ్డిపై నజర్ ఎందుకు.?
అసలు మంత్రి మల్లారెడ్డిపై ఎందుకు పార్టీకి చెందిన నలుగురు కీలక ఎమ్మెల్యేలు గుస్సా అవుతున్నట్లు.? ఈ విషయమై గులాబీ పార్టీలోనే బోల్డన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి.
మంత్రి మల్లారెడ్డి, ఆయా నియోజకవర్గాలపై పెత్తనం చేసే క్రమంలో పార్టీ అధినేత కేసీయార్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారనీ, భారీ మొత్తాన్ని పార్టీ ఫండ్‌గా ఇచ్చి, ఆయా నియోజకవర్గాల్లో పార్టీపై పెత్తనం కోసం మల్లారెడ్డి ప్రయత్నిస్తున్నారనీ సదరు ఎమ్మెల్యేలకు ఉప్పందిందట.
మల్లారెడ్డి ప్రయత్నం ఫలిస్తే, వచ్చే ఎన్నికల్లో ఆయన పెత్తనాన్ని భరించలేమన్న భావనతో ఆయా ఎమ్మెల్యేలు అప్రమత్తమయ్యారట.
300 కోట్లు.. నిజమేనా.?
ఏకంగా మూడొందల కోట్ల రూపాయలతో మంత్రి మల్లారెడ్డి ఈ నాటకానికి తెరలేపారట. అలాగని ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంత.? అన్న విషయాన్ని పక్కన పెడితే, జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన కేసీయార్, ఈ గందరగోళ పరిస్థితుల్ని ముందు చక్కదిద్దాల్సి వుంది.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ కూడా.. ఈ వ్యవహారంపై మిన్నకుండడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.