దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇకలేరు

Advertisement

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ శాసనసభ్యులు సోలిపేట రామలింగారెడ్డి ఇకలేరు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతూ నిన్న రాత్రి మృతి చెందిరు. అయితే 2004, 2008, 2014, 2019 ఎన్నికల్లో రామలింగారెడ్డి నాలుగు సార్లు దుబ్బాక నియోజకవర్గం ఎమ్మెల్యే గా గెలిచారు. ఇక 2001 నుండి TRS అధినేత కేసీఆర్ తో కలసి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు.

సోలిపేట రామలింగారెడ్డి సుమారు 25 ఏళ్ళు జర్నలిస్టుగా పనిచేసారు. అయితే 2004 లో సీఎం కేసీఆర్ పిలుపుమేరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పాత దొమ్మాట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గా పోటీచేసి విజయం సాధించాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో దుబ్బాక నియోజకవర్గాన్ని రామలింగారెడ్డి అభివృద్ధి పథంలో నడిపించాడు. ఇక ఇతని మరణ వార్త విన్న పలువురు రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here