జి‌హెచ్‌ఎం‌సి ఎలక్షన్ : కే‌సి‌ఆర్ మనిషి మేయర్ పీఠం ఎక్కాలి అంటే జరగాల్సింది ఇదే..!

జీహెచ్ఎంసీ ఎన్నికల ఓటింగ్ కు ఇంకా కొన్ని గంటలే సమయం ఉంది. అయితే.. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది.. అనే దానిపై మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఎందుకంటే.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన పార్టీయే వచ్చే ఎన్నికల్లో సత్తా చాటే అవకాశం ఉంది. అందులోనూ దుబ్బాక ఎన్నికల ఫలితాలు చూశాక.. తెలంగాణలోనే కాదు.. దేశమంతా ప్రస్తుతం హైదరాబాద్ ఎన్నికలపై ఆసక్తిగా తిలకిస్తోంది.

trs may win 90 seats in ghmc elections
trs may win 90 seats in ghmc elections

అయితే… జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కారు జోరు మీదనే ఉన్నదట. కొన్ని మీడియా హౌసులు ఇస్తున్న సమాచారంతో పాటుగా ఇంటెలిజెన్స్ సర్వేల ప్రకారం కారుకు 90కి పైనే సీట్లు వస్తాయి అనేది అంచనా. మరోవైపు ఎంఐఎంకు అటూ ఇటూగా 30 డివిజన్లలో సీట్లు వస్తాయంటున్నారు.

ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బీజేపీ. ఆ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చేస్తున్న హడావుడి మామూలుది కాదు. బీజేపీ.. ఏకంగా ఢిల్లీ లీడర్లనే హైదరాబాద్ లో దించింది. అయితే ఈ పార్టీకి ఓ 20 డివిజన్లు మాత్రమే దక్కుతాయని అంటున్నారు.

గతంలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 99 సీట్లలో గెలిచింది. బీజేపీకి 4 మాత్రమే వచ్చాయి. ఎంఐఎం మాత్రం 44 డివిజన్లలో గెలిచింది. ఈసారి కూడా పెద్దగా తేడా లేకుండా టీఆర్ఎస్ 90లలోనే ఉంటుందట. కాకపోతే.. బీజేపీ కాస్త బలంగా తయారవుతుంది ఈసారి. ఎంఐఎం పార్టీకి కూడా ఈసారి సీట్లు తగ్గే అవకాశముందని తెలుస్తోంది.

మొత్తం మీద మళ్లీ కారు దూసుకుపోవడం ఖాయం. ఎవరు ఎంత కొట్టుకున్నా.. తిట్టుకున్నా.. కారుదే హవా అంటూ వార్తలు వస్తున్నా… రేపు ఓటింగ్ జరిగి… డిసెంబర్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చేదాక.. ఏదీ చెప్పలేం. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు..

Advertisement