మోడీ వచ్చిన రోజే అతిపెద్ద వజ్రాయుధం బయటకి తీసిన కే‌సి‌ఆర్ – గ్రేటర్ యుద్ధం లో రచ్చ రచ్చ !

Tech Desk-2 - November 28, 2020 / 05:00 PM IST

మోడీ వచ్చిన రోజే అతిపెద్ద వజ్రాయుధం బయటకి తీసిన కే‌సి‌ఆర్ – గ్రేటర్ యుద్ధం లో రచ్చ రచ్చ !
గ్రేటర్‌ ఎన్నికల్లో సంపూర్ణ విజయం కోసం టీఆర్ఎస్‌ సర్వశక్తులను ఒడ్డుతోంది. సెంచరీతో మేయర్‌ పీఠంపై సగర్వంగా కూర్చుకోవాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. అడ్డ దారిలో కాకుండా పూర్తి స్థాయి మద్దతుతోనే బీజేపీ ని ఓడించి టీఆర్‌ఎస్‌ మేయర్‌ పీఠంను దక్కించుకోవాలని ప్రయత్నిస్తుంది. అందుకోసం కేసీఆర్‌ కూడా రంగంలోకి దిగారు. గల్లీ ఎన్నికలు అంటూ మొన్నటి వరకు కేసీఆర్‌ పెద్దగా సీరియస్‌ తీసుకోలేదు. కాని బీజేపీ వ్యవహరిస్తున్న తీరుతో కేసీఆర్‌ రూటు మార్చాడు. గ్రేటర్‌ ఎన్నికల ప్రచారం కోసం సిద్దం అయ్యాడు. ఇప్పటికే ప్రెస్‌మీట్‌ పెట్టి బీజేపీపై విమర్శలు చేసిన కేసీఆర్‌ నేడు బహిరంగ సభలో పాల్గొనబోతున్నాడు. ఈ బహిరంగ సభలో కేసీఆర్‌ ఏం మాట్లాడబోతున్నారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది.
TRS is pushing the almighty for an absolute victory in the Greater elections

TRS is pushing the almighty for an absolute victory in the Greater elections

ఎంఐఎం కూడా తమకు శత్రవులే అంటూ టీఆర్‌ఎస్‌ పార్టీ చెబుతూ వస్తోంది. బీజేపీమరియు ఎంఐఎం పార్టీలకు అవకాశం ఇస్తే హైదరాబాద్‌ లో అల్లర్లు జరుగుతాయి. గత ఆరు సంవత్సరాల్లో ఎప్పుడు కూడా హైదరాబాద్‌ లో అల్లర్లు కాని మత ఘర్షణలు జరగలేదు అనేది టీఆర్‌ఎస్‌ ప్రధానంగా చెబుతోంది. నేడు కేసీఆర్‌ కూడా అదే విషయాన్ని చెప్పబోతుంది. ప్రధాని నేడు హైదరాబాద్‌ కు వస్తున్న నేపథ్యంలో కేసీఆర్‌ బహిరంగ సభలో అతి పెద్ద వజ్రాయుదం అయిన సేఫ్‌ సిటీ ని ప్రధానంగా ప్రస్థావించబోతున్నాడు. గతంతో పోల్చితే ఇప్పుడు హైదరాబాద్‌ ఎంత ప్రశాంతంగా ఉంది ఎంతగా అభివృద్ది చెందింది అనే విషయాన్ని కేసీఆర్‌ వెళ్లడించబోతున్నారు.
బీజేపీ మరియు ఎంఐఎంలలో ఎవరు వచ్చినా కూడా మళ్లీ పాత రోజులు వస్తాయి. అభివృద్ది ఆగిపోవడంతో పాటు మళ్లీ మత ఘర్షణలు ఖచ్చితంగా మొదలు అవుతాయి అంటూ కేసీఆర్‌ వజ్రాయుదంను బయటకు తీసి దానిపైనే ఎక్కువగా ఫోకస్‌ పెట్టే అవకాశం ఉంది. బీజేపీ అంటేనే మతత్వ పార్టీ. కనుక ఖచ్చితంగా మత ఘర్షణలు హైదరాబాద్‌ లో జరుగుతాయి. వారిని ఎన్నుకుంటే ఏం జరుగుతుందో పలు రాష్ట్రాల్లో జరుగుతున్న మత ఘర్షణలు ప్రత్యక్ష సాక్ష్యంగా కనిపిస్తున్నాయి అంటూ కేసీఆర్‌ నొక్కి చెప్పబోతున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us