Sagar by poll : సాగర్ లో కారు స్పీడ్ కు కాంగ్రెస్ కంచుకోట మరోసారి బద్దలు.. బీజేపీకి డిపాజిట్ గల్లంతు

Sagar by poll : నాగార్జున సాగర్ లో కారు స్పీడ్ కు ఎవరు బ్రేకులు వేయలేకపోయారు. కారు స్పీడ్ కు కాంగ్రెస్ కంచుకోట బద్దలు అయిపోయింది. బీజేపీ పార్టీ అయితే కనీసం డిపాజిట్ కూడా తెచ్చుకోలేదు. నాగార్జున సాగర్ ఉపఎన్నికను టీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ సీరియస్ గా తీసుకొని.. సీఎం కేసీఆర్ ఏకంగా రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అదే టీఆర్ఎస్ పార్టీని నేడు గెలిపించింది. అలాగే… టీఆర్ఎస్ పార్టీకి సానుభూతి కూడా వర్కవుట్ అయింది. ఇదే సానుభూతి.. దుబ్బాక ఉపఎన్నికల్లో వర్కవుట్ కాకపోవడంతో.. టీఆర్ఎస్ పార్టీ సాగర్ లో గెలుస్తుందా? లేదా? అనే అనుమానాలు ఉండేవి.

trs candidate nomula bhagat wins in sagar bypoll
trs candidate nomula bhagat wins in sagar bypoll

మొత్తం మీద.. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ 18478 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి మరోసారి ఓటమి చెందాల్సి వచ్చింది. ఇక బీజేపీ అభ్యర్థి రవి కుమార్ కు కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు.  మొత్తానికి టీఆర్ఎస్ పార్టీ తమ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంది.

ఇప్పటికే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి మాంచి ఊపు మీద ఉన్న టీఆర్ఎస్ పార్టీకి సాగర్ ఉపఎన్నికల్లో గెలుపు కూడా మంచి ఉత్సాహాన్ని నింపింది. దీంతో టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు.

Advertisement