SSMB28 : ఇంటి సెంటిమెంటును వదలని త్రివిక్రమ్, మహేష్ బాబు కోసం మరో కొత్త ఇల్లు?
NQ Staff - December 8, 2022 / 02:46 PM IST

SSMB28 : త్రివిక్రమ్ సినిమాల్లో పంచులు, ప్రాసలతో పాటు హీరోకి సరికొత్త పేర్లు, స్టోరీలో ఇద్దరు హీరోయిన్లు, విలన్ ని హీరో డైరెక్టుగా చంపకపోవడం ఇలాంటి కామన్ పాయింట్స్ దాదాపు ప్రతి సినిమాలో కనిపిస్తుంటాయి. సరిగ్గా గమనిస్తే వీటితో పాటు కథ సాగే క్రమంలో ఇళ్లకు కూడా ఓ స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. స్టోరీ చాలా వరకు ఆ ఇంటిలోనే నడుస్తుంటుంది కూడా.
అతడు లో పార్థు ఇల్లు, అఆలో ఆనంద్ విహారి ఇల్లు, అత్తారింటికి దారేదిలో సునంద ఇల్లు, సన్నాఫ్ సత్యమూర్తిలో దేవరాజ్ ఇల్లు, అల వైకుంఠపురంలో టబు గ్రాండ్ ఇల్లు.. ఇలా ప్రతి సినిమాలోనూ ఇంటికి, ఆ యాంబియెన్సుకీ ప్రయారిటీ ఇస్తుంటాడు త్రివిక్రమ్.
తాజాగా మహేష్ బాబు సినిమా కోసం కూడా ఓ ఇంటి స్పెషల్ సెట్ వేసి షూట్ చేయనున్నాడట మాటల మాంత్రికుడు. దీంతో తన సెంటిమెంటు వర్కవుట్ అవ్వడమే కాక ప్రేక్షకులకు కూడా ఓ సరికొత్త ఎక్స్ పీరియన్స్ ని ఇవ్వొచ్చని త్రివిక్రమ్ ప్లానట. అలా అని ఏదో సెట్ వేయాలి కదా అని కాకుండా ప్రతి సినిమాకులాగానే ఈ కథకు కనెక్టయ్యేలా చూసుకుంటున్నాడట.
సరిగ్గా గమనిస్తే జల్సా మూవీలో పవన్ కళ్యాణ్ ఉండే బిల్డింగ్ పేరు కూడా జల్సానే. ఇలా ఇంటికి కూడా ఓ క్యారెక్టర్ ని డిజైన్ చేసి స్క్రిప్టు రాసుకోవడం త్రివిక్రమ్ మార్క్. ఏఫ్రేములో, ఎక్కడ నుంచి చూసిన ఏ ఇల్లు ఏ సినిమాలోదో ఆడియెన్స్ టక్కున చెప్పేయగలరు. అంతలా ప్రేక్షకులకి ఎక్కించగలడు త్రివిక్.
అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ఈ లేటెస్ట్ మూవీపై ఆడియెన్సులో భారీ అంచనాలే ఉన్నాయి. ఇంకా పేరు కూడా పెట్టకముందే #SSMB28 ఆరంభం అని హ్యాష్ ట్యాగులతో మూవీ షూట్ స్టార్టయిన వీడియో రిలీజ్ చేయగా అది సోషల్‌మీడియాను షేక్ చేసింది. పోకిరి రిలీజయిన రోజునే ఏప్రిల్ 28 తారీఖున ఈ సినిమాను కూడా విడుదల చేస్తామని ప్రకటించడంతో ఫ్యాన్సులో ఇంకాస్త జోష్ పెరిగింది.

Trivikram Srinivas will Shooting Special House Set For SSMB28
ఇప్పటికే షూట్ స్టార్టయి ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తయింది. క్రిష్ణగారి మరణంతో రీసెంట్ గా షూట్ కాస్త డిలే అయింది కూడా. కానీ త్వరత్వరగా షూట్ కంప్లీట్ చేసి అనుకున్న టైముకే రిలీజ్ చేసి హై ఆక్టెన్ ఎంటర్టెయినర్ గా ఆడియెన్సును అలరించేందుకు సిద్ధమవుతోందీ చిత్రం.
మరి త్రివిక్ ఇంటి సెంటిమెంట్ మార్కుతో పాటు మహేష్ తో ఉన్న ర్యాపో కూడా ప్రాపర్ గా వర్కవుటయి, కట్టిపడేసే కథ, కంటెంట్ స్క్రీన్ మీద అలరిస్తే బాక్సాఫీస్ దగ్గర భారీ రికార్డులతో అరిపించడానికి ఫ్యాన్సయితే ఫుల్ వెయిటింగ్. మరా ఎదురుచూపులకి తెరపడి సూపర్ స్టార్ మానియా మరోసారి ప్రూవవ్వాలంటే ఏప్రిల్ 28 వరకు వెయిట్ చేయాల్సిందే.