Trisha Krishnan : త్రిష కాలికి గాయం.. కిందపడడంతో ఫ్రాక్చర్.. పిక్ షేర్ చేసిన బ్యూటీ!

NQ Staff - November 6, 2022 / 03:45 PM IST

Trisha Krishnan  : త్రిష కాలికి గాయం.. కిందపడడంతో ఫ్రాక్చర్.. పిక్ షేర్ చేసిన బ్యూటీ!

Trisha Krishnan  : దక్షిణాది భాషా చిత్రాల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకున్న న‌టి త్రిష‌. దీంతో ఈమె తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితం.. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలిన ముద్దుగుమ్మలలో ఈమె ఒకరు.. స్టార్ హీరోలందరితో ఆడిపాడిన ఈ భామ ఇప్పుడు మాత్రం కోలీవుడ్ లోనే సెటిల్ అయ్యింది.. ప్రెజెంట్ తమిళ్ లో వరుస పెట్టి సినిమాలు చేస్తుంది..

అక్కడ ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ భామ ఇటీవలే పొన్నియన్ సెల్వన్ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది.. ఈ సినిమా మిగతా భాషల్లో ఎలా ఉన్నా తమిళ్ లో మాత్రం సూపర్ హిట్ అయ్యి భారీ వసూళ్లు రాబట్టింది.. ఈ సినిమా ఇచ్చిన విజయంతో ఈమె వెంటనే వెకేషన్ కు వెళ్ళింది.

గాయం కారణంగా..

ఆ వెకేషన్ లో బాగా ఎంజాయ్ చేస్తున్న ఈ భామకు అనుకోని సంఘటన షాక్ ఇచ్చింది. ఈమె సడన్ గా కింద పడడంతో కాలు ఫ్రాక్చర్ అయినట్టు చెబుతూ సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేసింది. టూర్ సగం అయిపొయింది అని బాగా ఎంజాయ్ చేస్తున్న సమయంలోనే ఇలా ఈమె కాలికి గాయం అయినట్టు చెప్పుకొచ్చింది.

ఈ గాయం కారణంగా తన వెకేషన్ సగంలోనే ఆగిపోయింది అని కాలికి అయిన గాయాన్ని ఫోటో తీసి పెట్టింది.. ఈ విషయం తెలిసిన ఆమె ఫ్యాన్స్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఇక ఈమె పొన్నియన్ సెల్వన్ 2 లో కూడా నటించ బోతుంది.. ఈ సినిమా లో ఈమె నటనకు మరోసారి ఫ్యాన్స్ ఫిదా అయ్యే ఛాన్స్ వుంది. 40కి చేరువ అవుతున్నా ఈమె అందం మాత్రం ఏమాత్రం తగ్గలేదు.. ఈ సినిమా వల్ల ఈమె క్రేజ్ మరోసారి పెరిగింది..

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us