Resignation: ఇదెక్కడి ఆఫ‌ర్.. జాబ్ రిజైన్ చేస్తే రూ.4 కోట్లు ఇస్తామ‌న్న కంపెనీ

Resignation: సాధార‌ణంగా మ‌న‌కు కంపెనీ్ ఆఫ‌ర్స్ అందులో ఉద్యోగం చేస్తేనే ఇస్తారు. మ‌నం చేసే ప‌నిప‌ట్ల నిబ‌ద్ధ‌త కోసం ఇంక్రిమెంట్స్ కూడా ఇస్తారు. అయితే ఓ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు వారి జాబ్‌కు రిజైన్‌ చేస్తే సమారు రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు చెల్లిస్తామని ఆఫర్‌ ఇస్తుంది. కానీ ఉద్యోగులు ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరిస్తున్నారు.

Trainual Company Offers $5000 for Resignation
Trainual Company Offers $5000 for Resignation

కొత్త ఉద్యోగుల నియామకం లేదా, ఆల్రెడీ ఉన్న ఉద్యోగులు ఆ సంస్థను వదిలి వెళ్లకుండా ఉండేలా చూడడం ఆయా సంస్థలకు కత్తిమీద సాములాగా మారింది.అందుకే ఉద్యోగుల భద్రతా, శాలరీను పెంచడం, బోనస్‌ ఇవ్వడంతో పాటు వారి పిల్లల ఎడ్యుకేషన్‌ కు సంబంధించి అనేక ప్రయోజనాల్ని అందిస్తున్నాయి. కానీ అందుకు భిన్నంగా కొత్త టాలెంట్‌ కోసం అరిజోనాకు చెందిన సాఫ్ట్‌వేర్ కంపెనీ ‘ట్రైన్యువల్’ సీఈఓ క్రిస్ రోంజియో కీలక నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు వారి జాబ్‌కు రిజైన్‌ చేస్తే సమారు రూ.2 కోట్ల చెల్లిస్తామని ఆఫర్‌ ఇచ్చారు. కొత్త ఉద్యోగుల నియమాకం సులభం అవ్వడంతో పాటు, ఉద్యోగం నుంచి రిజైన్‌ చేస్తున్న ఉద్యోగులు ఎలాంటి ఆర్ధిక సమస్యలు ఉండొద్దని భావించారు.

తాజాగా పే-టు- క్విట్‌లో భాగంగా ఈ ఆఫర్‌ను రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్లకు పెంచారు. ఇప్పటికీ ఆ ఆఫర్‌ను తిరస్కరించే ఉద్యోగులకు అదనపు ‘బెన్‌ ఫిట్స్‌’ ను కోల్పోతారని రోంజియో వెల్లించారు. ఈ సందర్భంగా రోంజియో మాట్లాడుతూ.. తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులు సంవత్సరానికి $80,000, $100,000 సంపాదిస్తున్నట్లయితే, $2,500 చాలా తక్కువగా ఉండొచ్చు.

Trainual Company Offers $5000 for Resignation
Trainual Company Offers $5000 for Resignation

లేదంటే వేరే సంస్థకు వెళ్లేందుకు ఇష్టపడకపోవచ్చు. అందుకే ఆఫర్‌ను $2,500 నుంచి $5000 పెంచాం. అయినా జాబ్‌కు రిజైన్‌ చేయలేదంటే వారికి అదనపు బెన్‌ఫిట్స్‌’ ను అందించమని చెప్పారు.